Begin typing your search above and press return to search.

ఉద్రిక్తత: గ్యాంగ్ రేప్ బాధితురాలి అంత్యక్రియలు చేసిన పోలీసులు

By:  Tupaki Desk   |   30 Sept 2020 3:40 PM IST
ఉద్రిక్తత: గ్యాంగ్ రేప్ బాధితురాలి అంత్యక్రియలు చేసిన పోలీసులు
X
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో గ్యాంగ్ రేప్ కు గురై చనిపోయిన మహిళ అంత్యక్రియలు ఉద్రిక్తతకు దారితీశాయి. పోలీసులు బాధితురాలి శవాన్ని రాత్రి 2.45 గంటలకు బలవంతంగా తరలించి అంత్యక్రియలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

సప్తార్ గంజ్ ఆస్పత్రిలో పోస్టుమార్టం అయిన మహిళ శవాన్ని తమకు అప్పగించాలని.. నిందితులను ఉరితీయాలంటూ కుటుంబ సభ్యులు, వివిధ పార్టీల నేతలు పెద్ద ఎత్తున ఆస్పత్రి ఎదుట ఆందోళన చేశారు. సున్నితమైన అంశం కావడంతో పోలీసులు అందుకు నిరాకరించారు.మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు ఇవ్వకుండా వారిని కడసారి చూపుకు నోచుకోకుండా డైరెక్టుగా రాత్రికి రాత్రే శవాన్ని తరలించారు.

ఢిల్లీ నుంచి బాధితురాలి కుటుంబాన్ని కూడా స్వగ్రామం తీసుకొచ్చి అంత్యక్రియలను అర్ధరాత్రి దాటాక 2.45 గంటలకు పోలీసులు బలవంతంగా నిర్వహించారు. కుటుంబ సభ్యులను కూడా ఒప్పించి హిందూ సంప్రదాయం ప్రకారం ఈ అంత్యక్రియలు చేశారు. రాత్రి చేయకూడదని తెలిసినా.. ఉద్రిక్త పరిస్థితులు వాటిల్లడంతో పోలీసులు అతికష్టం మీద ఈ తంతు నిర్వహించారు.

ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌ జిల్లాలో అత్యాచార బాధితురాలి మృతదేహానికి పోలీసులు అర్ధరాత్రి అంత్యక్రియలు నిర్వహించారు. ఇటీవల అత్యాచారానికి గురైన బాలిక చికిత్స పొందుతూ మృతి చెందింది. అయితే ఘటనకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలంటూ ఆందోళన రేకెత్తింది. నిందితులకు ఉరిశిక్ష విధించాలని పోలీసుల వాహనానికి అడ్డుపడ్డారు. దీంతో పోలీసులు అర్ధరాత్రి 2.45 గంటల ప్రాంతంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కుటుంబసభ్యులను సైతం అనుమతించలేదు. అంతేకాదు వారు రాకుండా ఇళ్లకు తాళం కూడా వేసి పోలీసులు భారీగా మోహరించారు. ఈ ఘటనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.