Begin typing your search above and press return to search.
రాజకీయాల్లో ఇంత దిగజారుడు తనాన్ని ఎప్పుడూ చూడలేదు..చంద్రబాబు - దేవినేని ఉమపై పోలీస్ సంఘం ఫైర్
By: Tupaki Desk | 22 Jan 2021 5:40 PM ISTగుడివాడ టూ టౌన్ ఎస్సై విజయకుమార్ ఆత్మహత్య చేసుకున్నారు. తాను నివాసం ఉండే అపార్ట్‌మెంట్లోనే ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. రెండు నెలల క్రితమే ఎస్సై వివాహం చేసుకున్నారు. భార్యను కాపురానికి తీసుకురాలేదని తెలుస్తోంది. ఇంతలోనే విజయ్ కుమార్ ఆత్మహత్య చేసుకోవడం కలకలంరేపుతోంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇదిలా ఉంటే ఎస్ఐ విజయ్ కుమార్ మరణాన్ని రాజకీయ లబ్ది కోసం వాడుకోవడంపై ఏపీ పోలీస్ అధికారుల సంఘం తీవ్రంగా ఖండించింది.
విజయవాడలో మీడియా సమావేశం నిర్వహించిన పోలీసు అధికారుల సంఘం నేతలు టిడిపి నేతల తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పేకాట శిబిరాలపై దాడులు చేసిన కారణంగా, ఎస్సై పై ఒత్తిడి తెచ్చారని, ఆ ఒత్తిడి తట్టుకోలేక ఎస్సై ఆత్మహత్య చేసుకున్నారు అంటూ టిడిపి నేతలు అవాస్తవాలను ప్రచారం చేస్తూ, కేసును తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జనకుల శ్రీనివాసరావు తెలిపారు.
రాజకీయాల్లో ఇంత దిగజారుడు తనాన్ని ముందు ఎప్పుడూ చూడలేదని పోలీసు రాష్ట్ర అధికారుల సంఘం నేతలు మండిపడ్డారు. ఎస్ఐ విజయ్ కుమార్ ఆత్మహత్య కేసు ప్రాథమిక విచారణలో ఉందని, దర్యాప్తులో అసలు వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని, కానీ టిడిపి నేతలు కావాలని కేసును తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు
ఎస్సై ఆత్మహత్యపై అవాస్తవాలు ప్రచారం చేసే వ్యక్తులపై న్యాయ పోరాటం చేయడానికి పోలీస్ అధికారుల సంఘం సిద్ధంగా ఉందని వారు స్పష్టం చేశారు. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు సైతం, ఎస్సై ఆత్మహత్యపై రాజకీయ కారణాలను ఆపాదించటం దారుణమన్నారు. దేవినేని ఉమ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పోలీసులను బెదిరించి దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు, పోలీస్ వ్యవస్థపై అనుచిత వ్యాఖ్యలు సరికాదన్నారు.