Begin typing your search above and press return to search.

సొమ్మసిల్లిన లక్ష్మణ్.. పోలీసులు ఈడ్చుకెళ్లారు..

By:  Tupaki Desk   |   12 Oct 2019 4:28 PM IST
సొమ్మసిల్లిన లక్ష్మణ్.. పోలీసులు ఈడ్చుకెళ్లారు..
X
ఆర్టీసీ కార్మికుల సమ్మె తెలంగాణలో ఉధృతంగా సాగుతోంది. 8వ రోజు కార్మికులు నిరసనలతో హోరెత్తిస్తున్నారు. శనివారం కుటుంబ సభ్యులతో కలిసి తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు బస్ డిపోల వద్ద బైటాయించారు.

కాగా ఆర్టీసీ కార్మికులకు బీజేపీ మద్దతు ప్రకటించింది. తాజాగా హైదరాబాద్ లోని కళాభవన్ నుంచి బీజేపీ నేతలు, కార్యకర్తలు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మన్ సారథ్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బస్ భవన్ ఎదుట బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్షణ్ బైటాయించారు.

దీంతో బస్ భవన్ వద్ద జరిగిన నిరసన ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. ఆర్టీసీ కార్మికులతోపాటు లక్ష్మణ్ కూడా ధర్నాలో పాల్గొన్నారు. పోలీసులు ఈ ధర్నాను అడ్డుకున్నారు. నిరసనకారులతోపాటు లక్ష్మణ్ ను కూడా పోలీసులు ఈడ్చుకెళ్లడం దుమారం రేపింది. అనంతరం లక్ష్మణ్ తో సహా నిరసనకారులను పోలీసులు అరెస్ట్ చేసి నారాయణగూడ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సమయంలో లక్ష్మణ్ సొమ్మసిల్లి పడిపోయారు.

లక్ష్మణ్ సొమ్మసిల్లి పడిపోవడంతో బీజేపీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. మరో వైపు డా. లక్ష్మణ్ ఆరోగ్యంపై బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా ఫోన్ చేసి పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిపై ఆరాతీశారు.