Begin typing your search above and press return to search.

ప‌నామా పేప‌ర్స్‌ లో ఇంకో ట్విస్ట్‌

By:  Tupaki Desk   |   17 Jun 2016 11:22 AM IST
ప‌నామా పేప‌ర్స్‌ లో ఇంకో ట్విస్ట్‌
X
ప్రపంచ వ్యాప్తంగా కలకలం సృష్టించిన 'పనామా పత్రాల' కేసులో మ‌రో కీల‌క మ‌లుపు. పనామా ప‌త్రాలు వెలుగులోకి రావ‌డాన్ని సీరియ‌స్‌ గా తీసుకున్న పోలీసులు ఈ ఎపిసోడ్‌ లో ఓ కంప్యూట‌ర్ ఆప‌రేట‌ర్‌ ను అరెస్టు చేశారు. ఈ ఆపరేటర్ సంస్థ కార్యాలయానికి చెందిన వ్య‌క్తి కావ‌డం విశేషం.

ప‌నామా నగరంలోని న్యాయ సలహా సంస్థ మొస్సాక్‌ ఫోన్సెకా సంస్థ నుండి పలువురు ప్రముఖుల విదేశీ ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం ఇటీవల లీకయిన విషయం తెలిసిందే. అనేక దేశాల్లో ఈ ప‌త్రాలు క‌ల‌క‌లం సృష్టించాయి. ఈ నేప‌థ్యంలో జెనీవా పోలీసులు ప‌త్రాలు ఆ వివ‌రాలు బ‌య‌ట‌కు పొక్కేందుకు కార‌ణం అంటూ కంప్యూట‌ర్ ఆప‌రేట‌ర్‌ ను అరెస్టు చేశారు.

పోలీసులు అరెస్ట్‌ చేసిన అనుమానితుడు తాను ఎటువంటి తప్పూ చేయలేదని చెబుతున్నప్పటికీ అధికారులు మాత్రం సమాచారాన్ని చోరీ చేసి విశ్వాసఘాతుకానికి పాల్పడినట్లు అతడిపై ఫిర్యాదు చేశారని మీడియా తన వార్తా కథనంలో వివరించింది. అయితే దీనిపై తదుపరి స్పందనకు కార్యాలయ ప్రతినిధి నిరాకరించారు.