Begin typing your search above and press return to search.

75 మందిని పెళ్లాడినోడి మాటలు విని షాక్ తిన్న పోలీసులు

By:  Tupaki Desk   |   6 Oct 2021 11:06 AM IST
75 మందిని పెళ్లాడినోడి మాటలు విని షాక్ తిన్న పోలీసులు
X
ఒకడ్ని నేరస్తుడన్న అనుమానంలో అదుపులోకి తీసుకున్న పోలీసులకు.. విచారణలో షాక్ తినే విషయాలు బయటకు వచ్చాయి. మధ్య ప్రదేశ్ లో చోటు చేసుకున్న ఈ ఉదంతం సంచలనంగా మారింది. ఒక సెక్సు రాకెట్ గుట్టు రట్టు చేసిన పోలీసులు.. అక్కడి వ్యభిచార కూపం నుంచి 21 మంది మహిళల్ని రక్షించారు. ఇదంతా ఒక ఎత్తు అయితే..దీనికి కారణమైన మునిర్ ను తాజాగా గుజరాత్ లోని సూరత్ లో పోలీసులు పట్టుకున్నారు.

ఇతడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరపగా.. విస్మయాన్ని రేకెత్తించే విషయాలు బయటకు వచ్చాయి. మునిర్ అలియాస్ మునిరుల్ బంగ్లాదేశ్ లోని జాసుర్ కు చెందిన వాడిగా తేల్చారు. బంగ్లా యువతుల్ని ఉపాధి పేరుతో భారత్ లోకి అక్రమంగా తరలించటం.. వారిలో పలువురిని బలవంతంగా వ్యభిచారంలోకి నెట్టటం చేసేవాడు. పశ్చిమ బెంగాల్ లోని ముర్షిదాబాద్ మీదుగా ఈ అక్రమ రవాణా సాగుతున్నట్లు గుర్తించారు.

ఈ అక్రమ రవాణాకు సహకరించే సరిహద్దు అధికారులకు రూ.25 వేల చొప్పున అంచనం ఇచ్చేవాడు. బంగ్లా యువతుల్ని ముంబయి.. కోల్ కతా ప్రధాన కేంద్రాలుగా వ్యభిచారానికి దింపేవాడని తేల్చారు. ఈ రీతిలో ఇప్పటివరకు 200 మంది యువతుల్ని భారత్ లోకి అక్రమ రవాణా చేసినట్లుగా అధికారులు గుర్తించారు. అంతేకాదు.. ఇతడు ఇప్పటివరకు 75 మందిని పెళ్లి చేసుకున్నట్లు చెప్పటంతో పోలీసులు సైతం షాక్ తిన్నారు. ఇతగాడి నేరాల చిట్టాలోకి మరింత లోతుల్లోకి వెళ్లి విచారణ జరపాలని డిసైడ్ అయ్యారు.