Begin typing your search above and press return to search.

తాను మోసపోయానంటున్న శిల్పా: పోలీసులపై ఆగ్రహం.

By:  Tupaki Desk   |   11 Dec 2021 9:30 AM GMT
తాను మోసపోయానంటున్న శిల్పా: పోలీసులపై ఆగ్రహం.
X
కిట్టీ పార్టీల పేరుతో కోట్లు కొల్లగొట్టిన శిల్పా చౌదరి ప్రస్తుతం పోలీస్ కస్టడీలోనే ఉన్నారు. ఆమెను పలు కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు. అయితే శిల్పా మాత్రం పొంతనలేని సమాధానాలు చెబుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు శిల్పా చౌదరి మోసం చేసిందని పలువురు బాధితులు పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించారు.

అయితే తనను అధిక వడ్డీలు చెల్లించాలని కొందరు వేధించినట్లు తాజాగా చెప్పినట్లు సమాచారం. అధిక వడ్డీలు ఇస్తానని డబ్బులు తీసుకున్న మాట వాస్తవమే..కానీ అంతకంటే ఎక్కువ వడ్డీలు చెల్లించి ఇద్దరి దగ్గర అప్పుు తీసుకున్నట్లు తెలిపింది. ఇక తాను సేకరించిన డబ్బంతా ఓ ఆసుపత్రికి చెల్లించినట్లు శిల్పా పోలీసులకు తెలిపినట్లు సమాచారం.

సంపన్న వర్గాల మహిళలకు కిట్టీ పార్టీలు అని చెప్పి వారి వద్ద నుంచి కోట్ల రూపాయలు సేకరించిన శిల్పా చౌదరిపై పలు కేసులు నమోదయ్యాయి. ఈనేపథ్యంలో ఆమెను పోలీస్ కస్టడీలో ఉంచి పోలీసులు విచారణ చేస్తున్నారు. దాదాపు వారం రోజులుగా ఆమెను విచారించిన పోలీసులకు రోజుకో కొత్త విషయం తెలుస్తోంది. అయితే అమె నిజం చెబుతుందా..? లేక అబద్ధం ఆడుతుందా..? అనే విషయం మాత్రం పోలీసులకు నిర్దారణ కావడం లేదు. అయితే ఆమె ఆరోపించిన వ్యక్తులను తీసుకొచ్చి ముఖాముఖి గా విచారణ చేయాలని చూస్తున్నారు.

ఇప్పటి వరకు తమ వద్ద డబ్బులు తీసుకొని మోసం చేసిందని సినీనటుడు సుధీర్ బాబు భార్య ప్రియదర్శిని పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంలో పోలీసులు శిల్పా చౌదరిని విచారించారు. దీంతో ఆమె తనను ప్రియదర్శినితో పాటు రోహిణిరెడ్డి అనే మహిళలు అధిక వడ్డీలు చెల్లించాలని ఒత్తిడి తెచ్చారని తెలిపింది.

తాను వేరొకరి వద్ద నుంచి వడ్డీ ఇస్తానని డబ్బులు తీసుకున్న విషయం వాస్తవమే.. అయితే అంతకంటే ఎక్కువ వడ్డీ చెల్లించి వారిద్దరి వద్ద అప్పు తీసుకున్నట్లు తెలిపినట్లు తెలుస్తోంది. ఇక ప్రియదర్శినికి నెలకు రూ.5 లక్షల వరకు వడ్డీ డబ్బులు చెల్లించేదానిని, అయినా ఇంకా ఎక్కువ కావాలని ఒత్తిడి తెచ్చిందని శిల్పా పోలీసులకు తెలిపినట్లు సమాచారం.

తాను సేకరించిన డబ్బంతా ఓ ఆసుపత్రికి చెల్లించినట్లు శిల్పా పేర్కొన్నట్లు తెలుస్తోంది. అయితే ఆ ఆసుపత్రి ఎవరిది..? దానికి శిల్పాకు ఉన్న సంబంధమేంటి..? అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అంతకుముందు తన డబ్బంతా హవాలా రూపంలో విదేశాలకు పంపిందన్న కోణంలో విచారించగా ఆమె బ్యాంకు అకౌంట్లను పోలీసులు పరిశీలించారు.

అయితే అందులో మొత్తం కలిపి రూ.2 లక్షల కంటే ఎక్కువ డబ్బు లేదు. అయితే ఆమెపై ఇన్ని కోట్ల ఆరోపణలు వచ్చినప్పడు ఆ నగదును ఎక్కడ పెట్టింది..? అనే విషయం పోలీసులకు అర్థం కావడం లేదు. మరోవైపు శిల్పా రోజుకో రకంగా ప్రవర్తించడంతో ఆమె ఆరోపణలు చేసే వ్యక్తులను ముఖాముఖిగా తీసుకొచ్చి విచారణ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఇక శిల్పాపై వస్తున్న కథనాలను ఆమె తెలుసుకొంది. దీంతో ఆమె పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లుసమారారం. తనపై లేని పోని అభాండాలు సృష్టించి ప్రచారం చేస్తున్నారని వారితో వాగ్వాదానికి దిగినట్లు తెలుస్తోంది. అయితే పోలీసులుకు సరైన ఆధారాలు లభించే వరకు ఆమెను కస్టడీలోనే ఉంచే అవకాశం ఉందని తెలుస్తోంది.

మరోవైపు శిల్పా బాధితులు ఒక్కొక్కరుగా బయటికి వస్తూనే ఉన్నారు. ఆమె చేసిన పనులపై పోలీసులను సీక్రెట్ గా కలుస్తూ చెబుతున్నారు. దీంతో పోలీసులు వారి వద్ద నుంచి వివరాలను సేకరించి ఆ కోణంలో శిల్పాను విచారిస్తున్నారు. అయితే శిల్పా నిజం చెబుతుందా..? అబద్ధమాడుతుందా..? అనేది పోలీసులకు అర్థం కావడం లేదు.