Begin typing your search above and press return to search.
వైసీపీ నేతలనే పోలీసులు పట్టించుకోవటంలేదా ?
By: Tupaki Desk | 21 Aug 2021 4:00 PM ISTవినటానికే ఆశ్చర్యంగా ఉన్నా జరుగుతున్నదలాగే ఉంది. మంత్రి అవంతి శ్రీనివాసరావు ఎవరో మహిళతో సరస సంభాషణలంటు సోషల్ మీడియాలో ఓ పోస్టు వైరల్ అయ్యింది. వైరల్ అయ్యిందనేకన్నా టీడీపీకి మద్దతుగా నిలిచే సోషల్ మీడియా, పార్టీ అభిమానులు దీన్ని ఉద్దేశ్యపూర్వకంగానే వైరల్ చేశారు. ఈ ఆడియో టేపుల్లోని సంభాషణల్లో నిజమెంతో ఎవరికీ తెలీదు. కానీ ప్రభుత్వంపై బురద చల్లడమే టార్గెట్ గా పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి వ్యతిరేక బ్యాచ్ మాత్రం ఫుల్లుగా ఆడియో టేప్ పేరుతో ఓ ఆడియోని సర్కులేట్ చేస్తోంది.
సరే సదరు ఆడియో టేపంతా ఫేక్ అంటు మంత్రి విశాఖ పోలీసు కమీషనర్ కు ఫిర్యాదు చేశారు. మంత్రి ఫిర్యాదుమేరకు సైబర్ పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు. ఆమధ్య సత్తెనపల్లి ఎంఎల్ఏ అంబటి రాంబాబు విషయంలో కూడా ఇలాంటి ఆడియోటేపులే సర్క్యులేట్ అయ్యాయి. ఇందులో కూడా నిజం ఎంతో తెలీదు. అయితే దాన్ని అంబటి ఖండిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారట.
ఇక్కడ గమనించాల్సిందేమంటే అంబటి ఫిర్యాదు చేసి సుమారు 15 రోజులవుతోంది. ఇంతవరకు దర్యాప్తు అతి గతి తెలీదు. నిజంగానే పోలీసులు అంబటి ఫిర్యాదును సీరియస్ గా తీసుకున్నారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇపుడున్న టెక్నాలజీలో ఓ ఆడియో టేప్ నిజమా ? లేకపోతే అబద్దమా ? అని తేల్చేందుకు ఎక్కువ సమయం పట్టే అవకాశం లేదు. కాకపోతే పోలీసులు సీరియస్ గా దృష్టిపెట్టాలంతే.
ఎంఎల్ఏ ఇచ్చిన ఫిర్యాదు విషయంలోనే పోలీసులు ఏమీ తేల్చకపోవటంతో ఇపుడు మంత్రి విషయంలో కూడా ఇలాంటి టేపులు సర్క్యులేట్ అవుతున్నాయి. ఎంఎల్ఏ, మంత్రుల పేర్లతో చెలామాణి అవుతున్న టేపులు నిజమే అయితే బాధ్యత ఎంఎల్ఏ, మంత్రిదే అనటంలో సదేహంలేదు. అదే అవి ఫేక్ టేపులని తేలితే దానికి బాధ్యులపైన పోలీసులు చర్యలు తీసుకోవాలి కదా. టేపులను తయారు చేసిందెవరు ? వాటిని కావాలనే సర్క్యులేట్ చేస్తున్నదెవరో తెలుకోవటం సైబర్ పోలీసులకు పెద్దపనికాదు. మంత్రి పేరుతో ఆడియో లోని మహిళను వైసీపీ నేతలు గుర్తించారట. ఆమె దగ్గరకు వెళ్ళి మాట్లాడితే తాను ఎవరితోనూ మాట్లాడలేదని స్పష్టంగా చెప్పారట.
ఎంఎల్ఏ ఫిర్యాదును పోలీసులు సీరియస్ గా తీసుకున్నట్లు లేదు. అందుకనే ఇపుడు మంత్రి పేరుతో టేపులు తిరుగుతున్నాయి. దీన్ని కూడా పోలీసులు సీరియస్ గా తీసుకోకపోతే మిగిలిన మంత్రులు విషయంలోనే ఇలాంటి ప్రచారం మొదలైపోతుంది. నిజంగానే ఎంఎల్ఏ కానీ మంత్రికానీ మహిళలతో సరస సంభాషణలు చేసుంటే అవి బయటపడే అవకాశాలు లేవు. ఎందుకంటే ఇటు మంత్రి కానీ లేకపోతే సదరు మహిళ కానీ టేపులను బయటపెట్టరు కదా ? అంటే ఇవి ఫేక్ టేపులనే అనుకోవాలి. దాన్ని తేల్చే బాధ్యత పోలసులపైనే ఉంది. ఏం చేస్తారో ? ఎప్పటికి తేలుస్తారో చూడాలి.