Begin typing your search above and press return to search.

ఫైటర్ జెట్స్ సెక్యూరిటీతో ఖతార్ కు పోలండ్ ఫుట్ బాల్ టీం.. ఫిఫా చరిత్రలోనే తొలిసారి

By:  Tupaki Desk   |   19 Nov 2022 4:58 AM GMT
ఫైటర్ జెట్స్ సెక్యూరిటీతో ఖతార్ కు పోలండ్ ఫుట్ బాల్ టీం.. ఫిఫా చరిత్రలోనే తొలిసారి
X
ప్రపంచవ్యాప్తంగా పిచ్చ క్రేజ్ ఉన్న ఫుట్ బాల్ మేనియా మొదలైంది. ఈ వరల్డ్ కప్ సమరానికి మరో రెండు రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటికే సాకర్ సమరంలో పాల్గొననున్న 32 జట్లు ఖతార్ దేశానికి చేరుకున్నారు. నవంబర్ 20 నుంచి ఫిఫా వరల్డ్ కప్ ప్రారంభం కానుంది.

ఇక యుద్ధ వాతావరణం పక్కనే ఉన్న పోలండ్ దేశం ఖతార్ కు తమ ఆటగాళ్లను చేర్చడానికి ఏకంగా యుద్ధ విమానాలను వాడింది. పోలండ్ ఫుట్ బాల్ జట్టు ప్రయాణిస్తున్న విమానంతో రెండు ఎఫ్16 యుద్ధ విమానాలు ఎస్కార్ట్ గా రావడం సంచలనమైంది. ఫిఫా వరల్డ్ కప్ చరిత్రలోనే ఒక జట్టు ఇలా ఎస్కార్ట్ తో రావడంతో సోషల్ మీడియాలో ఇదే తొలిసారి కావడం గమనార్హం.

పోలండ్ జట్టు ఇలా బలమైన యుద్ధ విమానాల ఎస్కార్ట్ తో రావడానికి కారణముంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగానే ఈ చర్య తీసుకుంది. ఈ రెండు దేశాల మధ్య యుద్ధం ప్రారంభమై 9 నెలలు గడుస్తున్నప్పటికీ ఇప్పటికీ క్షిపణి దాడులు జరుగుతూనే ఉన్నాయి. పోలండ్ దేశం రష్యా-ఉక్రెయిన్ లకు సరిహద్దుగా ఉంటాయి. ఇటీవలే ఈ యుద్ధంలో ఓ క్షిపణి వచ్చి పోలండ్ సరిహద్దు గ్రామంపై పడింది. ఈ దాడిలో ఇద్దరు పోలండ్ గ్రామస్థులు చనిపోయారు. పోలండ్ జట్టు ఫిఫా వరల్డ్ కప్ జరుగనున్న ఖతార్ కు వెళ్లాలంటే ఈ రెండు దేశాల ఎయిర్ బేస్ ను దాటుకొని వెళ్లాల్సిందే.

యుద్ధ వాతావరణం నేపథ్యంలోనే పోలండ్ దేశం తమ ఫుట్ బాల్ టీం ఖతార్ కు వెళ్లాలంటే ఎస్కార్ట్ తప్పనిసరి అని భావించి రెండు ఫైటర్ జెట్ ఎఫ్ 16 యుద్ధ విమానాలను ఎస్కార్ట్ గా పంపింది. మధ్యలో విమానం వెళ్లగా.. ఇరువైపులా ఫైటర్ జెట్స్ 16 లు ఎస్కార్ట్ గా ఖతార్ వరకూ వచ్చాయి. ఖతార్ లో తమ ఫుట్ బాల్ జట్టును సురక్షితంగా దించాయి. ఆ తర్వాత ఈ ఫైటర్ జెట్స్ మళ్లీ పోలండ్ కు తిరిగి వచ్చాయి.

ఇదే విషయాన్ని పోలండ్ ఫుట్ బాల్ టీం తమ ట్విటర్ లో వీడియో షేర్ చేసి పంచుకుంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మొత్తంగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా భయపడిన పోలండ్ జట్టు ఇంత పటిష్ట భద్రత మధ్య ఖాతార్ లో అడుగుపెట్టడం సంచలనమైంది. ఫిఫా చరిత్రలోనే ఒక జట్టు ఇంత సెక్యూరిటీతో రావడం చర్చనీయాంశమైంది,.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.