Begin typing your search above and press return to search.

మోడీకి సంబంధించి ఆ స‌మాచారం ఇవ్వ‌ర‌ట‌

By:  Tupaki Desk   |   8 May 2017 5:52 AM GMT
మోడీకి సంబంధించి ఆ స‌మాచారం ఇవ్వ‌ర‌ట‌
X
ప్ర‌జ‌ల్లో క్రేజ్ ఉన్న వారిని ఉప‌యోగించుకొని.. వారిని త‌మ ప్ర‌చారం కోసం వాడుకోవ‌టం వ్యాపార సంస్థ‌ల‌కు అల‌వాటే. అయితే.. స‌మ‌కాలీన రాజ‌కీయాల్లో ఎప్పుడూ లేని ఒక కొత్త వైనం ప్ర‌దాని మోడీ పుణ్య‌మా అని షురూ అయ్యింది. బ్రాండ్ ప్ర‌చారం కోసం దేశ ప్ర‌ధాని ఫోటోను వినియోగించే కొత్త వైనాన్ని కొన్ని కార్పొరేట్ సంస్థ‌లు.. కొన్ని సంస్థ‌లు వినియోగిస్తున్నాయి.

దేశ వ్యాప్తంగా మోడీకి ఉన్న ఇమేజ్ తో ఈ విధానానికి తెర తీశాయి ప‌లు కంపెనీలు. అయితే.. ఈ ప్ర‌చారం మొత్తం. నేరుగా వ్యాపారం కోస‌మ‌న్న‌ట్లుగా కాకుండా సామాజిక బాధ్య‌త అన్న‌ట్లుగా ఉంటూనే.. బ్రాండ్ కు స‌రికొత్త ఇమేజ్ క‌లిగించేలా ఉండ‌టం గ‌మ‌నార్హం. ఈ తెలివైన వ్యాపార ధోర‌ణిపై భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ప్ర‌ధాని మోడీ స్టార్ట్ చేసిన కొన్ని కార్య‌క్ర‌మాల్ని త‌మ‌దైన శైలిలో ప్ర‌చారం చేస్తున్న ప‌లు వ్యాపార సంస్థ‌లు క‌నిపిస్తాయి. అయితే.. వారి ప్ర‌చారంలో వారి బ్రాండ్‌ కంటే కూడా ప్ర‌దాని మోడీ ఫోటోను.. ఆయ‌న చేప‌ట్టిన కార్య‌క్ర‌మాన్ని ఎక్కువ‌గా హైలెట్ చేయ‌టం క‌నిపిస్తుంది. అస‌లు.. ఇలాంటి వాటికి ముంద‌స్తు ఏర్పాట్లు తీసుకున్నారా? లేదా? ఒక‌వేళ తీసుకుంటే.. అలా తీసుకున్న కంపెనీలు ఏమిటి? అన్న సందేహం ఒక స‌మాచార హ‌క్కు కార్య‌క‌ర్త‌కు కలిగింది.

వెంట‌నే.. త‌న సందేహాన్ని ద‌ర‌ఖాస్తు రూపంలో నింపి.. వివ‌రాల కోసం ప్ర‌భుత్వాన్ని కోరారు. ప్ర‌ధాని మోడీ ఫోటోల‌ను ప్ర‌క‌ట‌న‌ల కోసం వినియోగించేవారు ఎవ‌రు? వారి వివ‌రాలు ఇవ్వాల‌ని కోరారు. అయితే.. ఈ ప్ర‌శ్న‌కు తాము స‌మాధానం ఇవ్వ‌లేమ‌ని ప్ర‌దాన‌మంత్రి కార్యాల‌యం స్ప‌ష్టం చేసింది. మోడీ ఫోటోల‌ను వాడుకునేందుకు అనుమ‌తి కోరుతూ.. కంపెనీలు.. ట్ర‌స్టులు.. వ్య‌క్తులు దాఖ‌లు చేసిన ద‌ర‌ఖాస్తు వివ‌రాలు.. అనుమ‌తులు ఇచ్చిన వారి వివ‌రాలు.. తిర‌స్క‌రించిన వారి డిటైల్స్ ఇవ్వ‌లేమ‌ని పేర్కొంది. అదే స‌మ‌యంలో.. రిల‌య‌న్స్ జియో.. పేటీఎం లు ప్ర‌ధాని మోడీ ఫోటోల్ని వాడేందుకు ఏమైనా అనుమ‌తి అడిగారా? అన్న సందేహాల‌కు త‌మ వ‌ద్ద ఎలాంటి రికార్డులు లేవ‌ని చెప్ప‌టం గ‌మ‌నార్హం. ఇంత‌కీ అలాంటి వివ‌రాలు ఎందుకు ఇవ్వ‌న‌ట్లు? ఒక‌వేళ ఇస్తే జ‌రిగే న‌ష్ట‌మేమిటో?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/