Begin typing your search above and press return to search.

మోడీ.. ఎప్పుడూ ఆన్ లోనే ఉంటారట

By:  Tupaki Desk   |   27 Dec 2015 6:15 AM GMT
మోడీ.. ఎప్పుడూ ఆన్ లోనే ఉంటారట
X
తనపై నమ్మకం ఉంచి అధికారం కట్టబెడితే విరామం ఎరుగకుండా పనిచేస్తానని ఎన్నికల సందర్భంలో చెప్పిన మోడీ ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకుంటున్నారు. ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా ఆయన పని చేసుకుపోతున్నారు. పదవి చేపట్టిన నాటి నుంచి ప్రధాని ఒక్క రోజు కూడా లీవు తీసుకోలేదట. ఈ మేరకు సమాచార హక్కు చట్టం కింద దాఖలైన ఓ పిటిషన్‌ కు ప్రధాన మంత్రి కార్యాలయం(పీఎంఓ) సమాధానం ఇచ్చింది. ఇక సెలవు తీసుకోని ప్రధాని డ్యూటీ టైమింగ్స్ ఏమిటన్న ప్రశ్నకు కూడా పీఎంఓ విస్పష్ట సమాధానం ఇచ్చింది. పీఎం ఆల్ టైమ్ ఆన్ డ్యూటీ అంటూ 24 గంటలూ ప్రధాని విధి నిర్వహణలోనే ఉంటారని కూడా తేల్చిచెప్పింది.

ఇక ప్రధాని నుంచే నేరుగా ఎస్సెమ్మెస్‌ లు, ఈ-మెయిళ్లు ప్రముఖుల జన్మదినాల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వారికి బర్త్‌ డే విషెస్ చెబుతుంటారు. అంతేకాక పలు ముఖ్య వేడుకలు - పర్వదినాల సందర్భంగా ఆయన ట్విట్టర్ ఖాతాలో ప్రత్యేకంగా శుభాకాంక్షల ట్వీట్లు కనిపిస్తాయి. వీటిని నరేంద్ర మోడీనే స్వయంగా ట్వీట్ చేస్తారన్న వాదన కూడా ఉంది. ఇకపై ఆయన మరింత బిజీ కానున్నారు. ఎందుకంటే, ఏదైనా కొత్త విషయంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పు డు దానికి సంబంధించిన సంక్షిప్త సమాచారం (ఎస్సెమ్మెస్) నేరుగా ప్రధాని నుంచే మన మొబైల్‌ కు చేరుతుంది. అంతే కాదు. మన ఈమెయిల్ ఖాతాలోనూ ప్రధాని నేరుగా పంపే మెయిల్ కూడా ఉంటుందట. దీనికి సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ప్రజలను పాలనలో మరింత మేర భాగస్వాములను చేయాలన్న ఉద్దేశంతోనే ఈ కొత్త నిర్ణయం తీసుకున్నట్లు పీఎంఓ వర్గాలు చెబుతున్నాయి. ప్రధానంగా వృత్తి నిపుణుల మొబైల్ ఫోన్లు, ఈమెయిల్ అకౌంట్లకు ప్రధాని నుంచి సమాచారం రానున్నది.

అయితే.... ప్రధాని సెలవు తీసుకోకపోవడంపై విపక్షాలు సెటైర్లు వేస్తున్నాయి. ఆయన సెలవు తీసుకోకుండా పనిచేయడం లేదని... సెలవు తీసుకోకుండా విదేశాలకు వెళ్తున్నారని హాస్యమాడుతున్నాయి.