Begin typing your search above and press return to search.

లింక్డిన్ లోనూ నడుస్తోన్న మోడీ హవా

By:  Tupaki Desk   |   18 Aug 2015 4:33 AM GMT
లింక్డిన్ లోనూ నడుస్తోన్న మోడీ హవా
X
సోషల్ నెట్ వర్క్స్ లో ప్రధాని మోడీ హవా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియా విషయంలో దూసుకెళ్లే మోడీ.. ఇప్పటికే ఫేస్ బుక్.. ట్విట్టర్ ద్వారా పలు రికార్డులు సృష్టించటం తెలిసిందే. తాజాగా ఆయన లింక్డిన్ లోనూ తన సత్తా చాటుతున్నారు.

పేరుకు సోషల్ నెట్ వర్కింగ్ సైట్ అయినప్పటికీ.. చాలా పరిమితమైన వర్గం మాత్రమే వినియోగించే లింక్డిన్ లోనూ మోడీ క్రేజ్ అంతకంతకూ పెరిగిపోతోంది. ప్రపంచంలో అత్యధిక మంది అనుసరిస్తున్న మూడో ప్రపంచ నేతగా రికార్డు సృష్టించిన మోడీ.. ఫేస్ బుక్ లో దాదాపు 3కోట్లకు పైగా లైకులతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.

తాజాగా లింక్డిన్ లోనూ ఆయన తన హవా నడిపిస్తున్నారు. లింక్డిన్ సీఈవోల జాబితాలో మోడీ అగ్రస్థానంలో నిలిచారు. పది లక్షల మంది మోడీని అనుసరిస్తున్నారు. లింక్డిన్ లో అత్యధికంగా చూసే సీఈవో జాబితాలో మోడీ అరగస్థానంలో ఉన్నారు. 10 లక్షల మందికి పైనే లింక్డిన్ లో ఫాలో కావటం గమనార్హం. లింక్డిన్ నెట్ వర్క్ లో సీఈవోలను అత్యధికంగా చూసే వారిలో మోడీ మొదటి స్థానంలో.. గూగుల్ ఉపాధ్యక్షుడు.. ఎండీ రాజన్ ఆనందన్.. బయోకాన్ సీఈవో కిరణ్ మజుందార్ షా.. స్నాప్ డీల్ సీఈవో కునాల్ బాల్.. ఫేస్ బుక్ ఎండీ కీర్తిగ రెడ్డి.. ఇంటెల్ ఇండియా అధ్యక్షుడు కుముద్ శ్రీనివాసన్ తదితరులు ఉన్నారు. సోషల్ నెట్ వర్క్ ఏదైనా కానీ.. మోడీ ముద్ర మాత్రం స్పష్టంగా కనిపించటం కాస్తంత విశేషమే కదూ.