Begin typing your search above and press return to search.
మన్ కీ బాత్... మోడీని తెగ డ్యామేజ్ చేశారు
By: Tupaki Desk | 1 Sept 2020 9:00 PM ISTప్రధాని మోడీ నోటి నుంచి ఏమైనా మాటలు వస్తే చాలు.. వారు.. వీరు అన్న తేడా లేకుండా అందరూ తన్మయత్వానికి గురి కావటం.. ఆయన మాటల్ని పదే పదే కోట్ చేస్తూ.. గ్రేట్ సార్ మీరు అంటూ సోషల్ మీడియాలో ఉదరగొట్టేయటమే కాదు.. భారత్ దశను దిశను మార్చటానికే జన్మించిన అధినేతగా అభివర్ణించటం ఇప్పటివరకు చూస్తున్నా. అందుకుభిన్నమైన పరిస్థితి తొలిసారి చోటు చేసుకుంది.
ఆదివారం జాతిని ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ కు సంబంధించిన వీడియోకు.. గతంలో ఎప్పుడూ ఎదురుకాని సిత్రమైన పరిస్థితి ఎదురైంది. మోడీ చేసిన స్పీచ్ కు పెద్ద ఎత్తున డిస్ లైకులు హోరెత్తాయి. ఆగస్టు నెలకు సంబంధించిన మన్ కీ బాత్ వీడియోను యూట్యూబ్ చానల్ లో అప్ లోడ్ చేయగా.. లక్షలాది డిస్ లైక్స్ నమోదుకావటంపై విస్మయం వ్యక్తమవుతోంది. మోడీ మాటల్లో తేడా లేదు. ఎప్పటిమాదిరే మనసును ఆకట్టుకునే అంశాల్ని ప్రస్తావించారు. స్ఫూర్తివంతమైన ఒక సామాన్యుడి పేరును ప్రస్తావించారు. అది కూడా ఆంధ్రప్రదేశ్ కు చెందిన వ్యక్తిని.
ఇక.. దేశ ప్రజలు ఎంతగానో అభిమానించే స్వదేశీ నినాదాన్ని గుర్తు చేసేలా.. పిల్లలు ఆడుకునే బొమ్మల్ని దేశంలోనే తయారు చేయాలన్న పిలుపునిచ్చారు. కుక్కల విషయంలోనూ దేశీయ కుక్కల్ని పెంచుకోవాలన్న మాట చెప్పారు. ఇన్ని చెప్పిన మోడీ మాటలకు అంతలా డిస్ లైకులు ఏమిటి? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. దీనికి కారణం.. దేశంలోని యూత్ మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న నీట్..జేఈఈ పరీక్షల మీద మాట్లాడని మోడీ.. కుక్కలు.. పిల్లల ఆట వస్తువుల మీద మాట్లాడటం ఆగ్రహానికి గురి చేసిందంటున్నారు.
వారి తల్లిదండ్రులు సైతం ఈ విషయంలో తమ ఆగ్రహాన్ని డిస్ లైకుల రూపంలో చూపించారని చెబుతున్నారు. కీలకమైన అంశాల గురించి ప్రధాని ప్రస్తావిస్తారని భావించిన వేళ.. అందుకు భిన్నంగా మాట్లాడటం జాతి జనులకు నచ్చలేదని విశ్లేషిస్తున్నారు. మరి.. తర్వాతి మన్ కీ బాత్ లో అయినా మోడీ తన మాటల్ని మార్చుకునే అవకాశం ఉందా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.