Begin typing your search above and press return to search.
విశాఖకు ఏం తెచ్చారు...మోడీ ఏమిచ్చారు...?
By: Tupaki Desk | 13 Nov 2022 1:56 PM ISTభారీ సభ. మోడీ సార్ రాక అటు వైసీపీ ఇటు బీజేపీ చేసిన హడావుడి, మరో వైపు చూస్తే మధ్యలో పవన్ కళ్యాణ్ మోడీ తో భేటీ ఇలా విశాఖ పొలిటికల్ గా బాగానే ఫోకస్ అయింది. అదే టైం లో విశాఖలో ఏకంగా పదివేల కోట్ల రూపాయల పై చిలుకు ప్రాజెక్టులకు మోడీ శంకుస్థాపన చేశారని ఇక విశాఖకు మహర్దశ అని అంతా అనుకున్నారు. కానీ నిజానికి ఈ ప్రాజెక్టులు అన్నీ కేంద్ర ప్రాజెక్టులే. కేంద్రం కనుసన్నలలో నడిచేవే.
వాటి మీద వచ్చే తృణంలో ఫణమో కూడా అన్నీ కేంద్రానికే తప్ప విశాఖకు ఏపీకి ప్రత్యేకించి ఒరగదు అని అంటున్నారు. అంటే ఇది బీజేపీ వారి కవరింగ్, మోడీ సాబ్ కలరింగ్ అనే విమర్శలు ఇపుడు వినిపిస్తున్నాయి. ఇలా ఒక్కో ప్రాజెక్టుని స్కాన్ చేసి చూసినపుడు ఇదే విషయం బోధపడుతుంది. ముందుగా చూసుకుంటే 2,658 కోట్ల రూపాయల్తో శ్రీకాకుళం-అంగుల్ నేచురల్ గ్యాస్ పైపులైన్ ని 745 కిలోమీటర్ల కోసం వేస్తున్నారు. అయితే ఇది కేంద్రం ఆపరేట్ చేస్తుంది తప్ప ఏపీకి ఏమీ లాభం లేదు అని అంటున్నారు.
అదే విధంగా చూస్తే రాయపూర్ విశాఖ ఎకనామిక్ కారిడార్ అన్నారు. ఇది ఆరు లైన్ల గ్రీన్ ఫీల్డ్ రహదారిగా ఏకగా 3,778 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నారు. అది దీని వల్ల కేంద్రం పెట్టుబడులకే ఎక్కువ అవకాశం ఉంటుందని అంటున్నారు. అలాగే, పొరుగు రాష్ట్రాల వారికి పెట్టుబడులకు అవకాశం అని చెబుతున్నారు. మరి ఏపీకి ఏమిటి దక్కేను అంటే చిన్న చిన్న సెస్సెలేనట.
అలాగే, విశాఖ ఎన్‌హెచ్-516సి పైన అంటే కాన్వెంట్ జంక్షన్-షీలానగర్ జంక్షన్ వరకు ఆరు లైన్లతో రహదారిని మిరించే దానికి ప్రధాని మోడీ పచ్చ జెండా ఊపారు. మరి దీని వల్ల లాభమేంటి అంటే ఇది కూడా కేవలం జాతీయ రాజదారిగా డిజైన్ చేసినదే. ఏపీ కోసం ప్రాజెక్ట్ కింద దీనిని చూడలేరు అని అంటున్నారు.
ఇంకో వైపు చూస్తే 566 కోట్ల రూపాయలతో విశాఖ పోర్టు కనెక్టివిటీ కోసం అదనంగా నాలుగు వరసలతో డెడికేటెడ్ పోర్టు రోడ్డుని నిర్మిస్తున్నారు. దీనిని మొత్తంగా ఆపరేట్ చేసేంది పోర్టులు తప్ప ఏపీకి కానీ విశాఖకు కానీ ఒక్క పైసా ఆదాయం రాదు అని చెప్పేస్తున్నారు.
ఇక పోతే 152 కోట్ల రూపాయతో విశాఖ ఫిషింగ్ హర్బర్ ఆధునికీకరణ పనులు చేపడుతున్నారు. చెప్పాలంటే ఇది చాలా కాలంగా మత్య్సకారులు అడుగుతున్న డిమాండ్. ఇది పూర్తి అయితే ఎంతో కొంత స్థానిక మత్స్యకారులకు ప్రయోజనం ఉంటుంది అంటున్నారు.
ఇక 460 కోట్ల రూపాయాల్తో విశాఖ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధికి ప్రధాని శంకుస్థాపన చేశారు. అయితే ఎంతో ముఖ్యమైన విశాఖ రైల్వే జోన్ ఊసు ఎత్తకుండా దీన్ని చేపట్టారు అన్న విమర్శలు ఉన్నాయి. ఇక ఈ ప్రాజెక్ట్ వల్ల దేశీయ రైల్వేస్ కే లాభం ఆదాయం తప్ప మరోటి కాదని అంటున్నారు.
చివరిగా చూసుకుంటే ఓఎన్‌జీసీ-యుఫీల్డ్ ఆన్‌షోన్ సదుపాయాలు జాతికి అంకితం చేశారు నరేంద్ర మోడీ. అయితే ఇది కూడా పూర్తిగా కేంద్రానికి మాత్రమే లాభించే ప్రాజెక్ట్ అని ఏపీకి కనీసంగా సెస్సులు కూడా దీని వల్ల రావు అని అంటున్నారు. మొత్తానికి చూస్తే పది వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు విశాఖ సహా ఉత్తరాంధ్రకు ఇచ్చేశాం, ఏపీని అభివృద్ధి చేస్తున్నామని డప్పు కొట్టి చెప్పుకుంటున్నారు కానీ దీని వల్ల ఏపీకి ఒరిగేది ఏమీ లేదని అంటున్నారు. అదన్న మాట మ్యాటర్.