Begin typing your search above and press return to search.
పోటెత్తిన జనం...నోటి వెంట రాని వరం
By: Tupaki Desk | 13 Nov 2022 1:47 PM ISTప్రధాని నరేంద్ర మోడీ ఈ మధ్య కాలంలో తెలుగు రాష్ట్రాలలో ఇంతటి భారీ బహిరంగ సభ చూసి ఉండకపోవచ్చు. వేలదిగా జనంతో విశాఖ ఎయూ గ్రౌండ్స్ కిక్కిరిసేలా సభ జరిగింది. మోడీ జిందాబాద్ అంటూ నినాదాలు కూడా సభలో వినిపించాయి. మోడీ వంటి బలమైన ప్రధాని తమ ప్రాంతానికి వచ్చారు. మంచి విషయాలు చెబుతారు అని చాలా ఆత్రుతగా జనాలు సభలో పాలుపంచుకున్నారు.
ఇందులో అత్యధిక శాతం మహిళలు ఉన్నారు. అంటే నూటికి తొంబై శాతం అన్న మాట. పది రోజుల పాటు వైసీపీ శ్రేణులు శ్రమించి ప్రధాని సభను సక్సెస్ చేశాయి. అనుకున్నంత స్థాయిలో జనాలు వచ్చి సందడి చేశారు. ఈ సభ విజయవంతం అయిందని బీజేపీ శ్రేణులు కూడా పొగిడాయంటేనే అర్ధం చేసుకోవాలి. ఒక సవాల్ గా తీసుకుని నిర్వహించిన ఈ సభ కోసం ఏకంగా పదిహేను కోట్లు ఖర్చు పెట్టారని వైసీపీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం.
ఇక టీడీపీ నేతలు అయితే వంద కోట్లు పెట్టి సభ జరిపారని అంటున్నారు. మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి అయితే ఇంత స్థాయిలో సభను నిర్వహిస్తే మోడీ ఏపీకి ఏమిచ్చారు. ఏపీ సర్కార్ కేంద్రం నుంచి ఏమీ సాధించుకోలేకపోయిందని విమర్శించారు. బయటకు చెప్పకపోయినా వైసీపీ నేతల మదిలో కూడా అదే ఉంది. ఇంత ఖర్చు చేశాం, రాత్రీ పగలూ కష్టపడ్డాం, మోడీ మన ప్రధానే అన్న తీరున హడావుడి చేశాం, కానీ చివరికి ఏమైంది, ప్రధాని ఒక్క వరాన్ని కూడా ఇవ్వలేదు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇంకో వైపు చూస్తే ఈ సభను ఏయూ గ్రౌండ్స్ లో వచ్చిన వారు తరలించినబడిన వారే కాదు,చాలా మంది ఆసక్తిని చాటుకుని తాముగా వచ్చారు. ఆద్యంతం మోడీ సభలో ఉండి దేశ ప్రధాని తమ ప్రాంతానికి తమ రాష్ట్రానికి ఏమైనా మంచి వార్త చెబుతారా అని అనుకున్నారు. కానీ షరా మామూలుగానే మోడీ ప్రసంగించేసి వెళ్ళిపోయారు. వికాస్ భారత్ అన్న మంత్రం ఒకటి జపించారు.
కానీ ఆ వికాసం తాలూకా ఆనవాళ్ళూ ఏవీ ఏపీలో కనిపించడంలేదు సారూ అంటే మాత్రం మాట మాత్రంగా అయినా పట్టించుకోకుండా వెళ్ళిపోయారు. మొత్తానికి చూస్తే ఈ మీటింగ్ వల్ల వైసీపీకి ఒరిగింది లేదు రాష్ట్ర ప్రజలకు కలసి వచ్చింది లేదు అని అంటున్నారు. అదే టైం లో బీజేపీ వారికి మాత్రం ఈ మీటింగ్ ఒక ప్రచాస సాధనంగా ఉపయోగించుకేందుకు మారింది అని అంటున్నారు.
అందుకే సభకు ఎంతో అశలతో వచ్చిన వారు కిక్కిరిసిన జనాలు కూడా వెళ్ళేటపుడు మాత్రం పూర్తి నిరాశతోనే ఉన్నరని అంటున్నారు. విశాఖ ఉక్కు విషయంలో కచ్చితమైన హామీని మోడీ ఇవ్వలేదు, దీని తరువాత జరిగిన తెలంగాణా రాష్ట్రంలోని రామగుండంలో మాట్లాడుతూ రామగుండం కర్మాగారాన్ని ప్రైవేట్ పరం చేయమని ఇదే ప్రధాని చెప్పారు. మరి స్టీల్ ప్లాంట్ విషయాన్ని మాత్రం చెప్పలేకపోయారు. అంటే విశాఖ జనాలకే కాదు ఉద్యమాన్ని కూడా అవమానించారు అని అంటున్నారు.
అలాగే ఉత్తరాంధ్రాకు పనికి వచ్చే నిర్ణయాన్ని కూడా కేంద్రం ప్రకటించలేదని అంటున్నారు. కేంద్రం వద్ద లాబీయింగ్ చేసో లేక బతిమాలో బామాలో లేక గద్దించో ప్రాజెక్టులు తెచ్చుకోవడంలో ప్రభుత్వం విఫలం అయింది అని అంటున్నారు. సో సభ సక్సెస్ ఆశలు ఫెయిల్ అన్నట్లుగా మోడీ గారి విశాఖ టూర్ సాగింది అని అంటున్నారు.