Begin typing your search above and press return to search.

మోకరిల్లి మరీ సారీ చెప్పిన మోడీ.. ఆలస్యానికి సరికొత్త భాష్యం చెప్పేశారుగా?

By:  Tupaki Desk   |   2 Oct 2022 9:14 AM IST
మోకరిల్లి మరీ సారీ చెప్పిన మోడీ.. ఆలస్యానికి సరికొత్త భాష్యం చెప్పేశారుగా?
X
అందరూ చేసే తప్పులకు భిన్నంగా రియాక్టు అయ్యే ప్రముఖులు అతి కొద్ది మంది ఉంటారు. ఆ జాబితాలో ప్రముఖంగా కనిపిస్తారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఎక్కడికైనా వస్తామని చెప్పి.. సమయానికి వెళ్లకుండా ఉండటం భారతీయులకు అలవాటే. అందరికి తెలిసిన విషయాన్ని.. మిగిలిన వారికి భిన్నంగా తాను చేయటం ద్వారా మరోసారి వార్తల్లోకి ఎక్కటమే కాదు.. మోడీ మార్కు నాటకీయత మరోసారి ఆయనకు ప్రత్యేక గుర్తింపు వచ్చేలా చేసింది. ఇలాంటి మేజిక్కులు మోడీకి మాత్రమే సాధ్యమని చెప్పాలి.

తాజాగా రాజస్తాన్ లోని సిరోహి జిల్లాలోని అబురోడ్ వద్ద ర్యాలీ నిర్వహించారు. అక్కడ ఏర్పాటు చేసిన సభా వేదిక వద్దకు చేరుకోవాల్సిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆలస్యంగా హాజరయ్యారు. అది కూడా ఎంతలా అంటే.. రాత్రి పది గంటలు కావొస్తోంది. అలాంటి వేళ.. ప్రసంగించటం సముచితం కాదన్న విషయాన్ని ఆయన క్లుప్తంగా చెప్పారు. అలా చెబితే.. ప్రజలకు సరిగా అర్థమవుతుందో లేదో అనుకున్నారేమో కానీ.. తన రోటీన్ శైలికి భిన్నంగా వ్యవహరించి అందరిని సర్ ప్రైజ్ చేయటమే కాదు.. ప్రధాని హోదాలో ఉండి సామాన్యుల విషయంలో ఇంతటి పెద్ద మనసుతో వ్యవహరించటమా? అంటూ మనసును దోచేసుకున్నారు.

తాను ఆలస్యంగా రావటానికి క్షమాపణలు చెప్పటమే కాదు.. మూడుసార్లు మోకరిల్లి మరీ సారీ చెప్పారు. త్వరలోనే మరోసారి వస్తానని.. ఆ రోజున మాట్లాడతానని చెప్పిన ఆయన మాటలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. రాత్రి పది గంటల వేళలో మాట్లాడటం.. సభా మర్యాద కాదని.. నిబంధనల్ని ఉల్లంఘించటం తనకు ఇష్టం లేదన్న ఆయన.. త్వరలోనే తాను మరోసారి వస్తానన్న మాటను చెప్పారు. 72 ఏళ్ల వయసులో.. ప్రధానమంత్రి హోదాలో ఉండి కూడా ఎంత వినయంగా.. విధేయంగా ఉన్నారో అనుకునేలా ఆయన మూడుసార్లు మోకరిల్లి మరీ సారీ చెప్పేశారు. మోడీనా మజాకానా?