Begin typing your search above and press return to search.

లైవ్ అప్డేట్స్ : లాక్ డౌన్ పై 9 రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ !

By:  Tupaki Desk   |   27 April 2020 6:05 AM GMT
లైవ్ అప్డేట్స్ : లాక్ డౌన్ పై 9 రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ !
X
దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ ఏ విధంగా కొనసాగుతుంది...ప్రస్తుత పరిస్థితి ఏంటి ? లాక్ డౌన్ గడువు మే 3 తో ముగియబోతున్న నేపథ్యంలో మరోసారి లాక్ డౌన్ ను పొడగించాలా ? వద్దా ? ఒకవేళ లాక్ డౌన్ ను ఎత్తేస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే పలు అంశాలపై ఈ రోజు ఉదయం 10 : 30 నుండి ప్రధాని మోడీ 9 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడబోతున్నారు ....పాయింట్ టూ పాయింట్ లైవ్ అప్డేట్స్ ..DON 'T MISS

మరోసారి లాక్ డౌన్ ను పొడగించాలని ప్రధానిని కోరిన పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ..

దశల వారీగా లాక్‌డౌన్‌ ఎత్తేయాలని ప్రధానిని కోరిన పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ

ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ కి కేరళ సీఎం డుమ్మా

తమ సలహాలు రాత పూర్వకంగా ఇచ్చామని తెలిపిన కేరళ ప్రభుత్వం ...

కేరళ తరపున మోదీ వీడియో కాన్ఫరెన్స్ కి హాజరైన కేరళ సీఎస్ ....

కరోనా పై కలిసికట్టుగా పోరాడటం వల్లే మంచి ఫలితాలు వచ్చాయి , లాక్ డౌన్ లో చాలా లాభాలు కలిగాయి.

హాట్ స్పాట్లు , రెడ్ జోన్లులలో సడలింపు ఇచ్చే ప్రసక్తే లేదు: మోడీ