Begin typing your search above and press return to search.

స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ : మ‌నుషులంతా స‌మానమే

By:  Tupaki Desk   |   6 Feb 2022 8:00 AM IST
స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ : మ‌నుషులంతా స‌మానమే
X
సాయంకాల వెలుగుల్లో సంధ్యా వంద‌న వేళల్లో పూల ప‌రిమ‌ళాల న‌డుమ ఓ గొప్ప స్ఫూర్తి మంత్రం వినిపిస్తోంది.శాంతి మంత్రం వినిపిస్తుంది.ఆ శాంతి మంత్రం వెనుక కోట్ల ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌కు ప్ర‌తినిధిగా న‌రేంద్ర మోడీ ఉన్నారు.ఆయ‌న జాతికి అంకితం చేసిన రామానుజాచార్య విగ్ర‌హంలో ఓ గొప్ప అస‌మాన స్ఫూర్తి ఉంది.స్ఫూర్తి అస‌మానం..మ‌నిషి స‌మానం..మ‌నిషితో మ‌నిషి స‌ర్వం స‌మానం..ఐడెంటిక‌ల్లీ ఈక్వెల్..స‌ర్వ స‌మాన‌త‌ను పెంపొందించే సూత్రం మార్గం జ‌గ‌ద్గురువు చెంత..శ్రీ‌రామానుజాచార్యుల చెంత..ఇవాళ ..ముచ్చింత్త‌ల్ దారుల్లో..ఆ మంత్రం ఆ స‌మ‌తా సూత్రం లోకాస్స‌మ‌స్తా సుఖినో భ‌వంతు..శ్రీ‌మ‌తే రామానుజాయ న‌మః

దేశంలో స‌మాన‌త్వం ఉందా అన్న ప్ర‌శ్న ద‌గ్గ‌ర మోడీ రాక‌ను గుచ్చి గుచ్చి చూడండి.ఆ విధంగా ఆలోచిస్తే స‌మాన‌త్వ భావ‌న‌ను స్థిరంచేసేందుకు మోడీ ఏం చేస్తున్నారో కూడా మ‌నం వెత‌కాలి.ఆ విధంగా స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఎన్నింటికో స‌మాధానం కావాలి.

విశిష్టాద్వైత రీతిని ఎన్నో ఏళ్ల కింద‌ట ప్ర‌చారం చేసిన ఆ స‌మ‌తా మూర్తి మ‌ళ్లీ మ‌నుషుల మ‌ధ్య అసమానత‌ల‌ను తొల‌గించాలి అని అనుకోవ‌డం నిజంగానే కాస్త అత్యాశే కావొచ్చు.దేవుడికి,మ‌నుషులకు మ‌ధ్య ఇంకేం లేవు అంతా ఒక్క‌టే..జంద్యం అన్న‌ది అడ్డే కాదు అంటూ,గ‌ర్భ‌గుడిలోనూ బయ‌టా అంతా ఒక్క‌టే అని చాటి చెప్పిన స్ఫూర్తి మ‌నుషుల్లో మ‌మేకం అవుతుంద‌ని భావించాలి. తెలంగాణ ప్ర‌భుత్వంతో పాటు భార‌త ప్ర‌భుత్వం కూడా దేశంలో స‌మాన‌త్వ ఆచ‌ర‌ణ‌కు ఓ స‌మ‌ష్టి కార్యాచ‌ర‌ణ‌కు శ్రీ‌కారం దిద్దాలి.

మ‌నుషుల్లో స‌మాన‌త్వ భావ‌న‌ను పెంపొందించే క్ర‌మంలో వెయ్యేళ్ల కింద‌ట రామానుజా చార్యులు బోధించిన మార్గం విశిష్టాద్వైతం.మ‌నుషుల్లో దేవుడు..దేవుడిలో మ‌నుషులు అంతా ఒక్క‌టే.. రెండు కాదు ఒక్క‌టే.. స‌మాన‌త్వం అన్న‌ది ఓ ప్ర‌భోదాత్మ‌క ప‌దం.ఇవాళ వెయ్యేళ్ల త‌రువాత మ‌ళ్లీ అటువంటి త‌త్వ సారాన్ని ప్ర‌చారం చేసే ప్ర‌య‌త్నానికి మ‌రో ఆరంభం స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ.

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ జాతికి అంకితం చేసిన ఆ విగ్ర‌హం రేప‌టి వేళ ప్ర‌పంచ ఖ్యాతిని అందుకునేందుకు..తెలంగాణ ప‌ర్యాట‌కాన్ని విస్తృతం చేసేందుకు ఆన‌వాలు అవుతుంద‌ని చినజియ‌రు స్వామి భావిస్తున్నారు.తెలంగాణ ప్ర‌భుత్వం కూడా భావిస్తోంది. ఈ క్ర‌మంలో మోడీ ఇవాళ భాగ్య‌న‌గ‌రికి విచ్చేశారు. తిరునామం ధ‌రించి, సంప్ర‌దాయ వ‌స్త్రాల్లో యాగ శాల దగ్గ‌ర ఇత‌ర య‌జ్ఞ వాటిక‌ల ద‌గ్గ‌ర హైంద‌వ ధ‌ర్మానుసారం ప్ర‌వ‌ర్తించారు.సంప్ర‌దాయ రీతుల‌ను అన్నింటినీ పాటించి, స్వామి విగ్ర‌హాన్ని జాతికి అంకితం చేశారు.