Begin typing your search above and press return to search.

ప్రధానమంత్రి మోదీ ఖాతా హ్యాక్: ఏం జరిగిందంటే..?

By:  Tupaki Desk   |   12 Dec 2021 6:31 AM GMT
ప్రధానమంత్రి మోదీ ఖాతా హ్యాక్: ఏం జరిగిందంటే..?
X
నేటి కాలంలో సైబర్ నేరగాళ్ల బెడద తీవ్రంగా మారింది. ఇతరుల సోషల్ మీడియా ఖాతాలను హ్యాక్ చేస్తూ రకరకాల పోస్టులు పెడుతున్నారు. తమకు డబ్బు అవసరం ఉందంటూ.. ఆపదలో ఉన్నామంటూ పోస్టులు పెడుతున్నారు. దీంతో కొందరు తమ ఖాతా హ్యాక్ అయిందన్న విషయం తెలిసేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. కొందరు ఖాతాలను హ్యాక్ చేస్తూ వారి పేరిట స్నేహితులకు, బంధువులకు మెసేజ్లు పెడుతుండడంతో వాటికి రియాక్టయి నగదును పంపించిన సంఘటనలూ అనేకంగా ఉన్నాయి. అయితే సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడకండి.. అని ప్రభత్వం ఎప్పటికప్పుడు హెచ్చికలు జారీ చేస్తోంది. కానీ తాజాగా కొందరు హ్యాకర్లు ఏకంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ట్విట్టర్ ఖాతాను హ్యాక్ చేశారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేరిట ఉన్న ట్విట్టర్ ఖాతాలో గుర్తు తెలియని వ్యక్తలు చొరబడి ఆయన పేరిట ఓ పోస్టు పెట్టారు. ప్రభుత్వం బిట్ కాయిన్లను కొనుగోలు చేసి వాటిని ప్రజలకు పంచిపెడుతుందని ప్రచారం చేసినట్లు పోస్టు పెట్టారు. అయితే పీఎంవో కార్యాలయం వెంటనే అప్రమత్తమైంది. ఆయన ఖాతా హ్యాక్ కు గురైందని గుర్తించి వెంటనే ట్విట్టర్ యాజమాన్యానికి తెలిపింది. దీంతో యాజమాన్యం ఆ పోస్టును తొలగించింది. ఆ తరువాత మోదీ ఖాతాను పునరుద్దరించారు. దీంతో దేశంలో ఒక్కసారిగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఇప్పటికే వివిధ రకాలుగా సైబర్ నేరగాళ్ల మాయలో పడి చాలా మంది నష్టపోతున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా అకౌంట్లను హ్యాక్ చేసి వాటి ద్వారా పర్సనల్ విషయాలను తెలుసుకుంటారు. వారి నడవడికను గుర్తించి ఆ తరువాత బ్యాంకు అకౌంట్ల వివరాలు తెలుసుకుంటున్నారు. సాయం పేరిట ఇతరులకుపోస్టులు పెట్టి డబ్బులు గుంజుతున్నారు. ఇక కొందరు వివాదాస్పద పోస్టుల పెట్టి వారీ జీవితాలను నాశనం చేస్తున్నారు.

అయితే సైబర్ నేరగాళ్లకు అడ్డుకట్ట వేసేందుకు ఎన్ని ప్రయత్నాలు తీసుకుంటున్నా కొత్త టెక్నాలజీని ఉపయోగించి ఖాతాలను హ్యాక్ చేస్తున్నారు. ఇప్పటికే భారత్ సహా అనేక దేశాలు పెగాసస్ స్పైవేర్ బారిన పడ్డాయన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇండయాలో చాలా ఫోన్స్ వీటి బారిన పడ్డాయని అంటున్నారు. అయితే దీని ద్వారా మొబైల్ వినియోగదారుల గోప్యతకు భంగం కలిగుతుందని పలు కథనాలు వెల్లడిస్తున్నాయి. ఈ తరుణంలో ప్రధానమంత్రి మోదీ ట్విట్టర్ హ్యాక్ కావడం మరోసారి దీనిపై చర్చ సాగుతోంది.