Begin typing your search above and press return to search.

హఠాత్తుగా గురుద్వారా వెళ్లిన మోదీ? ఆంతర్యం ఏమిటో?

By:  Tupaki Desk   |   20 Dec 2020 2:20 PM IST
హఠాత్తుగా గురుద్వారా వెళ్లిన మోదీ? ఆంతర్యం ఏమిటో?
X
ప్రధాని నరేంద్రమోదీ హఠాత్తుగా ఢిల్లీలోని గురుద్వారా రికబ్​ గంజ్​ సాహిబ్​ను సందర్శించారు. మోదీ ఇక్కడకు వెళ్తున్నట్టు మీడియాకు గానీ అధికార వర్గాలకు గానీ సమాచారం లేదు. శనివారం ఆయన సడెన్​గా గురుద్వారా రికబ్​ గంజ్​కు సాహిబ్​కు వచ్చారు. సమాచారం లేకపోవడంతో అక్కడి మతగురువులు ఎవరూ ఆయనకు ఎదురురాలేదు.గురుద్వారాను సందర్శించిన మోదీ అక్కడున్న సిక్కుల మతగురువు తేజ్​ బహదూర్​కు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

మోదీ ఓ సాధారణ భక్తుడిలా గురుద్వారాకు వెళ్లడం గమనార్హం. ఆయన రోజువారీ షెడ్యూల్​లో ఈ విషయం లేదు. లేత నారింజ రంగు జుబ్బా, ముందురు ఆరెంజ్ రంగు పైకోటు, తెలుపు పైజామా ధరించిన ఆయన హఠాత్తుగా గురుద్వారాలో కనిపించారు. అధికారులకు కూడా సమాచారం లేదు. అయితే మోదీ ఉన్నట్టుండి ఇక్కడికి ఎందుకు వెళ్లారని రాజకీయవర్గాల్లో చర్చ మొదలైంది. అయితే తనవెంట తెచ్చుకున్న సామగ్రిని మోదీ గురుద్వారా సభ్యులకు ఇచ్చారు. అనంతరం కొద్దిసేపు వాళ్లతో మాట్లాడారు.

గురుద్వారా నిర్వాహకులు, కమిటీ సభ్యులు మోదీని సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు మోదీతో సెల్ఫీలు తీసుకున్నారు. అయితే ఇందుకు సంబంధించిన ఫొటోలను మోదీ ట్విట్టర్​లో పంచుకున్నారు. కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయబిల్లులకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు సాగుతున్న విషయం తెలిసిందే. ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఆందోళన చేస్తున్నారు. అయతే ఆ ఆందోళనల్లో ఎక్కువగా పంజాబ్​, హర్యానాకు చెందిన రైతులే ఉన్నారు. అక్కడి రైతుల్లో మెజార్టీ భాగం సిక్కు మతస్థులే. ఈ క్రమంలో మోదీ గురుద్వారాను సందర్శించడం ప్రాధాన్యం సంతరించుకున్నది.