Begin typing your search above and press return to search.

83 రోజుల తరువాత ఇదే తొలిసారి...ఆ రెండు రాష్ట్రాల్లో ప్రధాని ఏరియల్ సర్వే..!

By:  Tupaki Desk   |   22 May 2020 5:30 PM GMT
83 రోజుల తరువాత ఇదే తొలిసారి...ఆ రెండు రాష్ట్రాల్లో ప్రధాని ఏరియల్ సర్వే..!
X
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు పశ్చిమ బెంగాల్ - ఒడిశా రాష్ట్రాల్లో పర్యటించారు. అంఫన్ తుఫాన్ కారణంగా ఏర్పడిన నష్టాన్ని ఆయన ప్రత్యక్షంగా ఏరియల్ సర్వే చేసి పరిశీలించారు.ఈ వైరస్ నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ కారణంగా దాదాపు మూడు నెలలపాటు ఢిల్లీ దాటి ప్రధాని మోడీ అడుగుపెట్టలేదు. ఫిబ్రవరి-29న ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ - చిత్రకూట్ లో పర్యటించిన మోడీ ఆ తర్వాత ఢిల్లీ దాటి బయటకు ప్రయాణించలేదు. 83రోజుల తర్వాత ఇవాళ బెంగాల్ - ఒడిషాలో పర్యటిస్తున్నారు.

ఇవాళ ఉదయం బెంగాల్ రాజధాని కోల్ కతా ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న మోడీకి.. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ - గవర్నర్ జగదీప్ ధన్ కర్ మోడీకి స్వాగతం పలికారు. కరోనా వైరస్ నేపథ్యంలో మోడీతో సహా అందరూ ఫేస్ మాస్క్ లు ధరించి కన్పించారు. పశ్చిమ బెంగాల్ మరియు ఒడిశా రాష్ట్రాల్లో ఆంఫన్ తుఫాన్ కారణంగా ప్రభావితమైన ప్రాంతాలను ఇవాళ ఏరియల్ సర్వే ద్వారా మోడీ చూడనున్నారు. మోడీతో పాటు బెంగాల్ కు చెందిన కేంద్రమంత్రి బాబుల్ సుప్రియో,ఒడిషాకు చెందిన కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఏరియల్ సర్వేలో పాల్గొన్నారు.

అంఫన్ తుఫాన్ కారణంగా రాష్ట్రంలో సుమారు రూ.లక్ష కోట్ల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని మమతా బెనర్జీ అన్నారు. రాష్ట్రంలో జరిగిన నష్టాన్ని స్వయంగా చూడాల్సిందిగా ప్రధాని మోదీని సీఎం మమతా బెనర్జీ ఆహ్వానించారు. ఈ క్రమంలో ప్రధాని మోదీ ఏరియల్ సర్వే కి విచ్చేసారు. ఈ విపత్తు పై స్పందిస్తూ ప్రధాని మోదీ స్పందిస్తూ నష్టపోయిన ఏ ఒక్కరినీ కూడా వదిలి పెట్టబోమని, అందరినీ ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఇక ఈ ఏరియాల్ సర్వే తరువాత ఉత్తర24పరణాల జిల్లాలోని బసిర్హట్ లో నిర్వహించే ఓ మీటింగ్ లో పీఎం - సీఎం - గవర్నర్ పాల్గొంటారు. అంఫన్ తుఫాన్ కారణంగా పశ్చిమ బెంగాల్లో 72 మంది ప్రాణాలు కోల్పోయారు