Begin typing your search above and press return to search.

కరోనా పై విజయం సాధించడానికి మోదీ చెప్పిన ఆ ఏడు సూత్రాలు ఇవే !

By:  Tupaki Desk   |   14 April 2020 2:40 PM IST
కరోనా పై విజయం సాధించడానికి మోదీ చెప్పిన ఆ ఏడు సూత్రాలు ఇవే !
X
దేశ ప్రధాని నరేంద్రమోడీ ...కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో మరోసారి జాతిని ఉధ్దేశించి చేసిన ప్రసంగంలో కరోనా వ్యాప్తిని అరికట్టేందకు విధించిన లాక్‌ డౌన్‌ ను మే 3వ తేదీ వరకూ పొడిస్తున్నామని ప్రకటించారు. అలాగే ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ పై విజయం సాధించేందుకు ప్రతి భారతీయుడు పాటించాల్సిన ఏడు ముఖ్యమైన సూత్రాలను ప్రధాని మోదీ సూచించారు.

ఆ ఏడు సూత్రాల్నీ ప్రతీ ఒక్కరూ పాటించాలనీ, అలా పాటిస్తే .. కరోనా వైరస్ దేశంలో తప్పని సరిగా కంట్రోల్ అయిపోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఏడు సూత్రాలతో ప్రజల వెంట తానూ ఉంటానని తెలిపారు. దీనితో ఇప్పుడు మోదీ చెప్పిన ఏడు సూత్రాలేంటి? వాటిని ఎలా పాటించాలి అనే దానిపై దేశ వ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు.

ప్రధాని మోదీ చెప్పిన 7 కీలక సూత్రాలు ...

1. మీ ఇంట్లో ఉన్న వృద్ధులను జాగ్రత్తగా చూసుకొండి. ముఖ్యంగా అంతుకు ముందే ఏదైనా అరోగ్య సమస్య ఉన్న వాళ్ల విషయంలో ఇంకా శ్రద్ధగా ఉండాలి. వాళ్లకి కరోనా సోకకుండా కాపాడుకోవాలి. కుటుంబ సభ్యులు వారికి అండగా నిలవాలి.

2. లాక్‌ డౌన్ మరియు వ్యక్తిగత దూరంకి సంబంధించిన నిబంధనలను కచ్చితంగా పాటించాలి. ఇంట్లో తయారు చేసిన మాస్కులను ఉపయోగించండి. అదే సమయంలో... బయటకు వెళ్తే తప్పనిసరిగా మాస్క్ ధరించాలి.

3. మీ రోగ నిరోధక శక్తి పెంచుకొనేందుకు ఆరోగ్యశాఖ ఇచ్చిన మార్గదర్శకాలను పాటించండి.

4. కరోనాపై అవగాహనకు - ఇతరుల నుంచి అది సోకకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరూ తమ స్మార్ట్ మొబైళ్లలో ఆరోగ్య సేతు మొబైల్ యాప్ ఇన్‌ స్టాల్ - డౌన్‌ లోడ్ చేసుకోవాలి.

5. మీకు సాధ్యమైనంత వరకు.. పేదలకు సహాయం చేయండి. వాళ్ల ఆకలి కష్టాలు తీర్చే ప్రయత్నం చేయండి. ఆకలితో అలమటించే వారికి స్థానికులు భోజనం, ఇతరత్రా సాయం చెయ్యాలి. వారిని ఆదుకునే ప్రయత్నం చేయాలి.

6.మీకు పని చేస్తున్న చోట.. మీ తోటి ఉద్యోగుల పట్ల కరుణ - దయ చూపించండి. ఉద్యోగులు - శ్రామికులపై యజమానులు జాలి - దయతో ఉండాలి. ఏ కంపెనీ కూడా తమ ఉద్యోగులను విధుల నుంచి తొలగించవద్దు.

7.దేశవ్యాప్తంగా కరోనా పై పోరాటం చేస్తున్న యోధులు డాక్టర్లు - నర్సులు - పోలీసులు - పారిశుద్ధ్య కార్మికులు తదితరులను గౌరవించండి.......ప్రతీ ఒకరు వీటిని తప్పకుండా పాటించాలని కోరారు.