Begin typing your search above and press return to search.

బయటకు రావడం నిషిద్ధం..21 రోజులు దేశమంతా లాక్‌ డౌన్ ప్రకటించిన ప్రధాని

By:  Tupaki Desk   |   24 March 2020 3:06 PM GMT
బయటకు రావడం నిషిద్ధం..21 రోజులు దేశమంతా లాక్‌ డౌన్ ప్రకటించిన ప్రధాని
X
కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించే ఉద్దేశ్యంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం సాయంత్రం కీలక ప్రకటన చేశారు. ఈ రోజు ఆర్ధరాత్రి (మంగళవారం మార్చి 23 అర్ధరాత్రి గం.12) నుండి దేశవ్యాప్తంగా లాక్ డౌన్‌ ను ప్రకటించారు. ఇలాంటి క్లిష్ట సమయంలో దేశమంతా ఏకతాటిపై నిలిచిందని - జనతా కర్ఫ్యూకు అందరూ సహకరించారని - ఈ లాక్ డౌన్ దాని కంటే కీలకమని చెప్పారు. ఈ లాక్ డౌన్ మూడు వారాలు ఉంటుందని - 21 రోజుల పాటు ఎవరూ బయటకు రావొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రస్తుతం కర్ఫ్యూ తరహా వాతావరణం నెలకొందని చెప్పారు. ఈ 21 రోజులు జాగ్రత్తలు తీసుకోవాలని - లేదంటే అప్పుడు పరిస్థితులు మన చేతుల్లో ఉండవన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మనముందు ఉన్న ఏకైక మార్గం ఇంటి నుండి బయటకు రాకపోవడం అన్నారు. అన్ని రాష్ట్రాలు కూడా వైద్యానికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలని కోరినట్లు చెప్పారు. ఈ మూడు వారాలు ప్రతి నగరం - ప్రతి గ్రామం - ప్రతి వీధి లాక్ డౌన్ అన్నారు. ఈ లాక్ డౌన్ ప్రతి ఇంటికి లక్ష్మణ రేఖ వంటిదన్నారు.

ఏమైనా సరే ఇంటి నుండి బయటకు రావొద్దని పౌరులకు విజ్ఞప్తి చేశారు. ఒక వ్యక్తి ద్వారా వేలమందికి వైరస్ వ్యాప్తిస్తుందని - ప్రయివేటు ఆసుపత్రులు - ల్యాబ్స్ కూడా ప్రభుత్వాలకు సహకరిస్తున్నాయన్నారు. కరోనా లక్షణాలు ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలన్నారు. వైద్య సదుపాయాల మెరుగు కోసం రూ.15వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. ఒక వైరస్ సోకిన వ్యక్తి బయటకు వస్తే వేలమందికి సోకుతుందన్నారు.