Begin typing your search above and press return to search.
మోడీకి పొంగిన ప్రేమ.. ఆ ఒక్క రాష్ట్రం పైనే రీజన్ తెలుసా?
By: Tupaki Desk | 21 Sept 2020 3:20 PM ISTప్రధాని నరేంద్ర మోడీ.. రాజకీయ ఉద్ధండుడు. ఎక్కడ ఎలాంటి పాచిక వేయాలో.. ఎక్కడ ఎలాంటి వ్యూహం పన్నాలో రాజకీయంగా ఆయనకు తెలిసినంతగా.. బీజేపీలో ఇప్పుడున్న వారికి తెలియదంటే.. అతిశయోక్తికాదు. 2014లో ఏపీపై ఆయన వరాలజల్లు కురిపించారు. అదేసమయంలో టీడీపీ అధినేత చంద్రబాబును అక్కున చేర్చుకున్నారు. తన పాచిక పారి..తాను ప్రధాని అయ్యాక.. ఏపీని, బాబును కూడా పక్కన పెట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు కూడా మోడీ అదే రీతిలో రాజకీయాలు చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా గత నెల నుంచి ఇప్పటి వరకు ఆయన ఓ రాష్ట్రంపై ప్రత్యేకంగా చూపిస్తున్న ప్రేమతో ఏపీ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు కుతకుతలాడుతున్నాయి.
మోడీ దృష్టి ఇప్పుడు పూర్తిగా బిహార్ రాష్ట్రంపైనే ఉంది. అక్కడ జేడీయూ సారథి, సీఎం నితీశ్‌కుమార్‌ను తనవైపు తిప్పుకొన్న మోడీ.. వచ్చే నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితిలోనూ గెలుపు గుర్రం ఎక్కితీరాలనే కసితో అడుగులు వేస్తున్నారు. బిహార్ పై మోడీ వరాల జల్లు కురిపిస్తున్నారు. ఇప్పటికే 9 వేల కోట్ల విలువైన గ్యాస్ ఆధారిత ప్రాజెక్టులు మంజూరు చేసి.. పక్కా ప్రణాళిక తో కరోనా సమయం లోనూ వాటిని పూర్తి చేయించి.. ఇటీవలే బిహార్ ప్రజలకు అప్పగించారు. ఇక, ఇప్పుడు తాజా గా రూ.14 వేల కోట్ల విలువైన 350 కిలో మీటర్ల రహదారులకు సోమవారం శంకుస్థాపన చే్యనున్నారు. నిజానికి ఈ ప్రాజెక్టులను బిహార్ ప్రజలు ఎప్పుడో మరిచిపోయారు.
ఎందరో నాయకులు ఈ హామీలు ఇచ్చినా.. ఏళ్ల తరబడి అవి పూర్తికాలేదు. ఈ క్రమంలో మోడీ.. వాటిని పూర్తి చేశారనే ప్రచారం జోరందుకుంది.ఇది వచ్చే నెల ఎన్నికల్లో మోడీకి భారీగా కలిసి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు పరిశీలకులు. అందుకే ఆయన తన ప్రేమనంతా బీహార్‌పైనే కుమ్మరిస్తున్నారని చెబుతున్నారు. మంచిదే. సహజంగానే ఎవరికైనా ఎన్నికల్లో గెలుపు గుర్రాలు ఎక్కాలనే ఉంటుంది. సో.. మోడీ వ్యూహాన్ని.. కార్యక్రమాలను తప్పుబట్టలేం.అయితే,మిత్రపక్షాలను, మిగిలిన రాష్ట్రాలనుకూడా మోడీ ఆదుకోవాలి కదా.. అంటున్నాయి.. మోడీకి మద్దతుగా నిలిచిన ఏపీ, తమిళనాడు, కర్ణాటక.. వంటి రాష్ట్రాలు.
ఆయా రాష్ట్రాలు కూడా మోడీకి ఎన్నో రూపాల్లో మద్దతిస్తున్నాయి. తాజాగా వ్యవసాయ బిల్లును దేశంలోని సగం రాష్ట్రాలకు పైగా వ్యతిరేకించినా.. తమిళనాడు అధికార పార్టీ అన్నాడీఎంకే, ఏపీ అధికార పార్టీ వైసీపీలు మద్దతిచ్చాయి. ఈ క్రమంలోనే మోడీ నీ ప్రేమ మాపై కూడా చూపించు.. అని కలవరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికిప్పుడు అవసరం లేదుకనుక మోడీ వచ్చే ఎన్నికల వరకు వెయిట్ చేస్తారో.. ఈలోగానే కరుణిస్తారో చూడాలి.