Begin typing your search above and press return to search.

ప్లీజ్‌ నా ప్లేస్‌ నా కివ్వండి ... అభ్యర్థిస్తున్న మాజీ మంత్రి

By:  Tupaki Desk   |   14 Nov 2019 6:21 AM GMT
ప్లీజ్‌ నా ప్లేస్‌ నా కివ్వండి ... అభ్యర్థిస్తున్న మాజీ మంత్రి
X
బండ్లు ఓడలు ..ఓడలు బండ్లు అవ్వడం అంటే ఇదేనేమో ..ఒకప్పుడు తన చేత్తో ఎంతో మందికి ఉపాధి కల్పించిన అయన ..ప్రస్తుతం నాకు నా సీటు ఇవ్వండి అని ఇతరులని అడిగే స్థాయి కి వచ్చేసారు. అందుకే అంటారు రాజకీయం లో ఏదైనా సాధ్యమే అని. రాజకీయాలలో ఉంటే .. రాజ భోగం ఎప్పుడు ఉంటుందో.. ఎప్పుడు పోతుందో ఎవరికీ తెలియదు. అందుకే అధికారంలో ఉండ గానే అన్ని సర్దు కోవాలని ప్రయత్నిస్తుంటారు. ఇక ఒకప్పుడు అందనంత ఎత్తు లో ఉండి .. ఇప్పుడు ఎవరికీ కన పడకుండా పోయిన ఆ నేత ఎవరో కాదు ..మాజీ మంత్రి కొత్తపల్లి శ్యామ్యూల్‌ జవహర్‌. ప్రత్యర్థుల పై విమర్శనాస్త్రాలు విసరడం లో ఈయన కి ఈయనే సాటి.

హాయిగా నెల జీతం తో హుందా గా గడిచి పోతున్నా టీచర్‌ ఉద్యోగానికి గుడ్‌ బై చెప్పి.. టీడీపీ లో చేరారు కొత్తపల్లి శ్యామ్యూల్‌ జవహర్. ఆ తరువాత 2014లో కొవ్వూరు నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించారు. అంతేకాదు విజయం తో పాటుగా అదృష్టం సైతం తన్నుకు రావడంతో ఏకంగా ఎక్సైజ్‌ శాఖ కే మంత్రి అయ్యారు. మాటల్ని తూటాల్లా ప్రత్యర్థి పార్టీల పై వదిలే ఈ మాజీ మంత్రి జవహర్‌.. ప్రస్తుతం ఏం చేస్తున్నారు? అయన పొలిటికల్ కెరియర్ ఏంటి ? అనే విషయం పై పశ్చిమ గోదావరి జిల్లా లో చర్చనీయాంశం గా మారింది. మంత్రిగా ఉన్న జవహర్ కాస్త ..2019 ఎన్నికలలో సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయి వేరే చోటు నుండి పోటీ చేసి ఘోర పరాజయం పాలైయ్యారు.

ఆయన కు వ్యతిరేకం గా ఓ వర్గం గా ఏర్పడిన కొందరు నేతలు.. సిట్టింగ్ స్థానం నుంచి కాకుండా వేరే చోటు నుంచి పోటీ చేయించేలా చేశారు. కానీ , ఇటు జవహర్.. అటు ఆయన వ్యతిరేక వర్గం ఇద్దరూ ఎన్నికలలో ఓటమిపాలయ్యారు. జవహర్ వల్ల పార్టీ తీవ్రంగా నష్టపొతుందని.. ఎట్టి పరిస్థితుల్లో కొవ్వూరు టికెట్టు ఆయనకు ఇవ్వొద్దంటూ అధిష్టానం పై ఒత్తిడి పెంచిన వ్యతిరేక వర్గం, ఆయనని తిరువూరు కు పంపి.. ఆయన సిట్టింగ్‌ స్థానమైన కొవ్వూరు లో వంగలపూడి అనిత కు టికెట్‌ ఇప్పించారు. కానీ , ఇద్దరూ కూడా ఎన్నికల లో ఓటమి పాలైయ్యారు.

దీనితో మళ్ళీ మాజీ మంత్రి కన్ను తనకు విజయాన్ని కట్టబెట్టిన కొవ్వూరు వైపే లాగుతునట్టు తెలుస్తోంది. తిరిగి తన సిట్టింగ్ నియోజకవర్గం లో అడుగుపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ.. దానికి పార్టీ హైకమాండ్‌ మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదట. ఇక తిరువూరులో ఎంత చేసిన తన సామాజికవర్గం అక్కడ గెలవదనే ఆలోచనతో ఉన్న ఆయన, ఎలాగో అలా కొవ్వూరులో ఉండి పార్టీని మళ్లీ తనవైపుకు తిప్పుకోవాలని భావిస్తున్నారు. అయితే పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎంతో కొంత సంపాదించిన డబ్బు అంతా ఖర్చు అయిపోయిందని.. అటు ఆర్ధికంగా…ఇటు రాజకీయంగా తీవ్రం గా నష్ట పోయాయని జవహర్‌ సన్నిహితుల వద్ద వాపోతున్నారట. మరి జవహర్ విషయం లో పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.