Begin typing your search above and press return to search.

ప్లేస్టోర్ లో చాలా హాట్‌ గా మారిపోతోంది

By:  Tupaki Desk   |   16 Oct 2016 10:30 PM GMT
ప్లేస్టోర్ లో చాలా హాట్‌ గా మారిపోతోంది
X
ప్రపంచవ్యాప్తంగా అన్నివర్గాలవారిని ఉర్రూతలూగించే శృంగార వారపత్రిక ప్లేబాయ్ కొత్త‌గా తెర‌మీద‌కు వ‌స్తోంది. ఇన్నాళ్లు అచ్చు రూపంలో వ‌చ్చిన ప్లేబాయ్ ఇపుడు ఆపిల్ - గూగుల్ ప్లేస్టోర్‌ లోకి ప్రవేశించింది. మారుతున్న కాలానికి తగినట్టుగా కొత్తతరం పాఠకులను ఆకర్షించేందుకు సరికొత్త సాంకేతికతను ప్లేబాయ్ అందిపుచ్చుకొన్నది. ఈ ఏడాది తర్వాత ప్లేబాయ్‌ కు బ్రాండ్ పరంగా సరికొత్త రూపాన్ని ఇవ్వనున్నామని, అందుకే శక్తిమంతమైన సంప్రదాయ - డిజిటల్ మీడియా ఫ్లాట్‌ ఫాంపై తమ సంస్థ వ్యవహారాలను పంపిణీ చేసేందుకు పక్కా ప్రణాళికను రూపొందించామని ప్లేబాయ్ నిర్వాహకులు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రస్తుత - కొత్త పాఠకులకు తమ సాహిత్యాన్ని అందించేందుకు ప్రయత్నాలు ప్రారంభించామని, అందుకే ఐట్యూన్స్ - గూగుల్ ప్లే స్టోర్స్‌లో యాప్ సేవలను అందించాలని నిర్ణయించామన్నారు.

శృంగార - నగ్న చిత్రాలతో 1950లో తొలిసారి ప్రచురణను ప్రారంభించి ప్లేబాయ్ సంచలనం రేపింది. సాంకేతిక ప్రపంచంలో పోటీని తట్టుకొనేందుకు కొత్త హంగులు - డిజైన్‌ లో 2016 మార్చి సంచికను మార్కెట్‌ లోకి విడుదల చేసింది. అయితే సాంకేతిక పోటీ పెద్ద ఎత్తున ఎదుర‌వుతున్న నేప‌థ్యంలో ప్లేస్టోర్‌ లో త‌మ అభిమానుల‌ను ఉర్రూత‌లూగించేందుకు ప్లేబాయ్ సిద్ద‌మైంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/