Begin typing your search above and press return to search.

పులులు, సింహాల మధ్యలో గోల్ఫ్ ఆడాలి.. దమ్ముందా మీకు?

By:  Tupaki Desk   |   30 Aug 2022 1:31 PM GMT
పులులు, సింహాల మధ్యలో గోల్ఫ్ ఆడాలి.. దమ్ముందా మీకు?
X
గోల్ఫ్ అంటే పచ్చని మైదానాల్లో ఆడాలని అందరూ అనుకుంటారు. ఈ అలవాటు ఉన్న అందరూ ఆ గేమ్ ను ప్రకృతి ఒడిలో ఆడుతుంటారు.

అయితే అడవిలో గోల్ఫ్ ఆడుతారా? నాలుగు సింహాలు, చిరుతలు,పులుల మధ్యలో కాచుకు కూర్చున్న 20 హైనాలు పొంచి ఉన్న వేళ గోల్ఫ్ ఆడే దమ్ముందా మీకు.. ఆఫ్రికా అడవిలో గోల్ఫ్ ఆడినట్టు అన్నట్టు.. కానీ అది అడవి కాదు.. అచ్చం అలా తీర్చిదిద్దిన ఓ గోల్ఫ్ కోర్టు.

దక్షిణాఫ్రికాలోని క్రూగర్ నేషనల్ పార్క్ నడిమధ్యన స్కూకుజా గోల్ఫ్ క్లబ్ లో కొందరు ఆటగాళ్లు గోల్ఫ్ ఆడుతుండగా వారి ఆటకు ఈ క్రూర మృగాలు ఇలా బ్రేక్ వేశాయి. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అడవికి, గోల్ఫ్ కోర్టుకు మధ్య ఎటువంటి రక్షణ కంచె లేకపోవడంతో జంతువులు ఇలా తరచూ గోల్ఫ్ కోర్టులోకి వచ్చేస్తుంటాయి. గోల్ఫ్ కోర్టులోని కృత్రిమ నీటి గుంటలో దప్పిక తీర్చుకుంటాయి. ఇలాగే వచ్చిన జిరాఫీలతోపాటు చిరుత పులులు, మృగాలు, ఏనుగులు , అడవి దున్నలు కనిపించాయి.

అయితే జిరాఫీపై పులులు దాడి చేసి తినేస్తుండగా అక్కడే గోల్ఫ్ ఆడుతున్న వారి గుండెలు జారుకున్నాయి. జంతువులపైనా దాడి చేసినట్టు తమపై కూడా జంతువులు దాడి చేసి చంపేస్తే క్లబ్ నిర్వాహకులకు బాధ్యతల లేదని అగ్రిమెంట్ పై సంతకం వారినే ఇందులోకి అనుమతిస్తారు.

క్రూగర్ నేషనల్ పార్క్ లో ఆడేందుకు గట్స్ కావాలని.. జంతువుల భయం లేనివారే రావాలని నిర్వాహకులు కోరుతున్నారు. పర్యాటకులకు కూడా ఇందులో ఆడే అవకాశం ఇస్తారు. కానీ దమ్ము ధైర్యం ఉంటేనే ఇందులో ఆడాలి. ప్రపంచంలోకెళ్లా అత్యంత కఠినమైన, క్రూరమైన గోల్ఫ్ కోర్టుగా దీన్ని పిలుస్తున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.