Begin typing your search above and press return to search.

శ్రీవారి ఆలయం పై చక్కర్లు కొట్టిన విమానం ... అపచారం అంటూ భక్తుల ఆగ్రహం

By:  Tupaki Desk   |   5 Feb 2020 3:18 PM IST
శ్రీవారి ఆలయం పై చక్కర్లు కొట్టిన విమానం ... అపచారం అంటూ భక్తుల ఆగ్రహం
X
ఆ కలియుగ దైవం, ఆపదమొక్కుల వాడు కొలువై ఉన్న అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల. ఈ తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి ప్రపంచం లోని నలు మూలల నుండి రోజుకి లక్షల సంఖ్యల్లో భక్తులు వస్తుంటారు. ఒక్కసారి ఆ శ్రీవారి దర్శనం అయితే జన్మ ధన్యమై పోతుంది అనుకునే వారు కోట్లల్లో ఉన్నారు. కాగా , హిందువులు ఎంతో పవిత్రంగా భావించే తిరుమల లో తాజాగా ఒక అపచారం జరిగింది.

తిరుమల శ్రీవారి ఆలయం ఉన్న ప్రదేశాన్ని నో ఫ్లైయింగ్‌ జోన్‌ కింద ఉన్నప్పటికీ..గత రెండు రోజులుగా శ్రీవారి ఆలయం మీదుగా ఒక విమానం చక్కర్లు కొడుతోంది. ఆగమ శాస్త్రం ప్రకారం శ్రీవారి విమాన వేంకటేశ్వరస్వామి వారి గర్భ గుడి పై విమానాలు వెళ్లకూడదనే నియమం ఉంది. తిరుమల కొండ పై దేవతలు విహరిస్తుంటారని, అందుకే అక్కడ విమానాలు తిరిగితే అపచారమని న్హాక్తులు విశ్వసిస్తారు. అలాగే సైన్స్ ప్రకారం కూడా ఆ ప్రాంతంలో పాజిటివ్ రేస్ ఎక్కువగా ఉండటం వలన.. ఆ ప్రదేశంలో విమానాలు తిరిగితే అవి పేలి పొయే అవకాశాలు ఉన్నాయి. బ్రిటీష్ వారి హయాంలో ఇలా రెండు విమానాలు పేలినట్లు ఆధారాలు కూడా ఉన్నాయి.

కానీ , ఈ నియమాలని పట్టించుకోకుండా అప్పుడపుడు కొన్ని విమానాలు శ్రీవారి ఆలయం పై చక్కర్లు కొడుతుంటాయి. తాజాగా మరోసారి రెండు రోజులుగా శ్రీవారి ఆలయం పైన ఒక విమానం చక్కర్లు కొడుతుండటం తో విజిలెన్స్ అధికారులు, భద్రతా సిబ్బంది వెంటనే దీనిపై చెన్నై ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌ కు విజిలెన్స్ అధికారులు ఫిర్యాదు చేశారు. అయితే, ఈ విమానం సర్వే ఆఫ్ ఇండియాకు సంబంధించిందిగా గుర్తించారు. భౌగోళిక పరిస్థితుల అధ్యయనానికే విమానం వచ్చిందని సంబంధిత సిబ్బంది చెబుతున్నారు.

అయితే , దేనికోసమైన కానీ , శ్రీవారి ఆలయం పై విమానం తిరగడం అనేది అపచారం అని , పండితులు చెప్తున్నారు. అలాగే ఈ వ్యవహారం పై శ్రీవారి భక్తులు కేంద్రం పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీవారి ఆలయంపై విమాన రాకపోకలు నిషేధం అని తెలిసినప్పటికీ కూడా సర్వే ఆఫ్ ఇండియాకు ఏటీసీ ఎలా అనుమతి ఇచ్చిందని ప్రశ్నిస్తున్నారు. దీనిపై భక్తులు తీవ్రంగా స్పందిస్తుండటం తో టీటీడీ దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టిఈ వ్యవహారం పై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.