Begin typing your search above and press return to search.
హచ్.. దెబ్బకు విమానం నిలిచిపోయింది!
By: Tupaki Desk | 13 March 2020 12:15 PM ISTచైనా లో పుట్టిన కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా(కోవిడ్-19)పైనే చర్చ నడుస్తోంది. కరోనా పేరు చెబితేనే ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఎవరైనా తుమ్మినా.. దగ్గినా.. కరోనా సోకిందనే భయంతో వణికిపోతున్నారు. ఇందుకు తాజాగా జరిగిన ఓ సంఘటన నిదర్శనంగా నిలుస్తోంది. ఫ్లైట్ లో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడు హచ్.. అని తుమ్మితే ఏకంగా విమానాన్ని అత్యవసరంగా నిలిపివేశారు. ఆ వ్యక్తిని పరీక్షలు నిర్వహించిన తర్వాతనే ఫ్లైట్ కదిలింది. ఈ సంఘటనలో అమెరికాలో జరిగింది.
కొలరాడో రాష్ట్రంలోని ఈగిల్ ఎయిర్ పోర్టు నుంచి న్యూజెర్సీకి ఓ విమానం బయలుదేరింది. ఫ్లైట్ బయలుదేరిన కొద్దిసేపటికి ఓ ప్రయాణికుడికి తుమ్ములు.. దగ్గు వచ్చింది. ఇంకేముంది.. తోటి ప్రయాణికులు కరోనా ఏమోనని భయపడిపోయారు. వెంటనే సిబ్బందికి సమాచారమిచ్చారు. అలర్ట్ అయిన సిబ్బంది డెన్వర్ ఎయిర్ పోర్టులో ఫ్లయిట్ ను ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. అప్పటికే సమాచారాన్ని తెలుసుకున్న వైద్యులు ఆ వ్యక్తిని క్షుణ్ణంగా పరిశీలించారు. అలర్జీతోనే తుమ్ములు - దగ్గు వచ్చాయని తేలడంతో ప్రయాణీకులు ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాతే విమానం అక్కడి నుంచి బయలుదేరింది.
చైనాలో సోకిన ఈ మహమ్మారి తో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎంతో దెబ్బతింటుందో. రవాణా వ్యవస్థ కూడా పూర్తిగా స్తంభించిపోయింది. ఇండియాలోనూ కరోనా వ్యాపిస్తోంది. విదేశాల నుంచి వచ్చిన వారి నుంచి కరోనా అటాక్ అవుతోంది. ఇప్పటి వరకు దేశంలో 73 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జలుబు - దగ్గు - జ్వరం - కళ్ల మంటలు.. కరోనా వైరస్ లక్షణాలు. ఈ లక్షణాలు ఉంటే వెంటనే వెళ్లి డాక్టర్ కి చూపించుకోవాలి. వీటి పట్ల నిర్లక్ష్యం చేయకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.