Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ లోకి పీకే జాయిన్..? త్వరలో సోనియాగాంధీతో సమావేశం..

By:  Tupaki Desk   |   16 April 2022 10:33 AM GMT
కాంగ్రెస్ లోకి పీకే జాయిన్..? త్వరలో సోనియాగాంధీతో సమావేశం..
X
రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ పేరు మరోసారి మారుమోగుతోంది. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరుతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే గతంలోనే ఆయన కాంగ్రెస్లో చేరుతారని ప్రచారం సాగినప్పటికీ కొన్ని విభేదాల కారణంగా అందులో చేరలేదు. కానీ తాజాగా కాంగ్రెస్ ముఖ్యనాయకులు రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ లతో పీకే సమావేశమయ్యారు. దీంతో ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం ఖాయమని తెలుస్తోంది. వచ్చే సంవత్సరంలో గుజరాత్ ఎన్నికలు జరగనున్నాయి ఈ సమావేశంలో ప్రధానంగా గుజరాత్ లో 2024లో జరిగే అసెంబ్లీ ఎన్నికలపై చర్చించినట్లు తెలుస్తోంది. గుజరాత్ ఎన్నికలతో పాటు వచ్చే సార్వ్రతిక ఎన్నికలపై కూడా వ్యూహం గురించి చర్చించినట్లు సమాచారం. అయితే ఇప్పటి వరకు ఆయా పార్టీల తరుపున పనిచేసిన పీకే ఇప్పుడు ఏకంగా పార్టీ నాయకుడిగా పనిచేయనున్నారు.

వాస్తవానికి 2020లోనే ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ప్రచారం సాగింది. అయితే అనేక విషయాల్లో పార్టీ నాయకులతో పీకేకు అభిప్రాయ భేదాలు వచ్చాయి. దీంతో ఆయన కాంగ్రెస్ తో పాటు ఏపార్టీలో చేరలేదు. అయితే 2014లో బీజేపీకి పనిచేసిన ఆయన ఇప్పుడు కాంగ్రెస్ కోసం పనిచేస్తుండడం చర్చనీయాంశంగా మారింది.

కొన్నాళ్లుగా ఆయన బీజేపీ వ్యతిరేక పార్టీల కోసం పనిచేస్తూ ఆ పార్టీలు అధికారంలోకి రావడానికి వ్యూహం రచించారు. తమిళనాడు, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో బీజేపీకి వ్యతిరేకంగా పనిచేసి డీఎంకే, టీఎంసీ పార్టీలు అధికారంలోకి రావడానికి కృషి చేశారు. కొన్ని నెలలుగా ఆయన తెలంగాణలోని టీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే కేసీఆర్ నేత్రుత్వంలో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తామని ప్రయత్నాలు జరిగిన అవి సఫలం కాలేదు. ఈ సమయంలో కాంగ్రెస్ లేకుండా మూడో ఫ్రంట్ సాధ్యం కాదని ప్రశాంత్ కిశోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో కాంగ్రెస్ తో కలిసుంటేనే బీజేపీని ఓడించవచ్చని సంకేతాలు పంపారు. దీంతో బీజేపీ వ్యతిరేక పార్టీల్లోనూ కొన్ని కాంగ్రెస్ లేకుండా మూడో ఫ్రంట్ కు సహకారం ఇవ్వమన్నట్లు తెలిపారు. అయితే ఇదంతా పీకే వ్యూహంలో భాగమేనని ప్రచారం సాగింది.

తాజాగా ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరుతుండడాన్ని భట్టి ఆ పార్టీ కోసం తన వ్యూహాన్ని రచించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల కాంగ్రెస్ ముఖ్యనాయకులతో సమావేశమైన ఆయన త్వరలో సోనియాగాంధీతో కూడా మీటింగ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే సార్వత్రిక ఎన్నికలతో పాటు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలను కూడా టార్గెట్ చేసుకొని పనిచేయనున్నారు. అయితే అధికారికంగా మాత్రం ఈ విషయాన్ని కాంగ్రెస్ నాయకులు ధ్రువీకరించడం లేదు. కానీ త్వరలోనే సోనియా ఆధ్వర్వ్యంలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి ఆ తరువాత ప్రశాంత్ కిశోర్ ను పార్టీలో చేర్చుకుంటారని సమాచారం.

మొన్నటి వరకు ప్రశాంత్ కిశోర్ టీంలో పనిచేసిన సునీల్ ను రంగంలోకి దించుతారని ప్రచారం సాగింది. కొందరు కాంగ్రెస్ సీనియర్ నాయకులు ప్రశాంత్ కిశోర్ ను ఒప్పించి తమ పార్టీలోకి జాయిన్ కావాలని కోరినట్లు సమాచారం. ఇందుకు ప్రశాంత్ కిశోర్ కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది. మరి కాంగ్రెస్ నాయకుడిగా పీకే ఎలాంటి వ్యూహం పన్నుతారో చూడాలి.