Begin typing your search above and press return to search.

కేసీఆర్‌ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం: పీయూష్ గోయ‌ల్ ఫైర్‌

By:  Tupaki Desk   |   24 March 2022 4:30 PM GMT
కేసీఆర్‌ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం:   పీయూష్ గోయ‌ల్ ఫైర్‌
X
తెలంగాణ సీఎం కేసీఆర్‌పై కేంద్ర మంత్రి పీయాష్ గోయ‌ల్ తీవ్ర‌స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అన్ని రాష్ట్రాల మాదిరిగానే తెలంగాణ నుంచి రా రైస్‌ సేకరణ జరుగుతోందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. కేసీఆర్‌ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వమని ఆయన విమర్శించారు. రా రైస్‌ కేంద్రానికి ఎంత ఇస్తారని ఎన్నిసార్లు అడిగినా చెప్పట్లేదని.. తెలంగాణ మినహా అన్ని రాష్ట్రాలు రా రైస్‌ ఎంత ఇస్తాయో చెప్పాయని కేంద్ర మంత్రి వివరించారు.

ఒప్పందం ప్రకారమే ఎఫ్‌సీఐ ద్వారా ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయని మంత్రి స్పష్టం చేశారు. తెలం గాణ పట్ల తమకు ఎలాంటి వివక్ష లేదన్నారు. తెలంగాణ నేతలు తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నార న్న కేంద్ర మంత్రి.. ప్రజలను అక్కడి ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోందని విమర్శించారు. తెలంగాణ రైతు లకు బాసటగా ఉంటామని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు.

``తెలంగాణ పట్ల మాకు ఎలాంటి వివక్ష లేదు. తెలంగాణ నేతలు మాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. తెలంగాణ ప్రజలను అక్కడి ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోంది. తెలంగాణ రైతులకు బాసటగా ఉంటాం. ముడిబియ్యం సేకరణకు తెలంగాణ సహా అన్ని రాష్ట్రాలతో ఒప్పందం. పంజాబ్‌తో అనుసరిస్తున్న విధానమే తెలంగాణలోనూ అమలు చేస్తాం. పంజాబ్‌, తెలంగాణ రెండు మాకు సమానమే. ఏపీ 25లక్షల మెట్రిక్‌ టన్నుల ముడిబియ్యం ఇచ్చింది`` అని మంత్రి వ్యాఖ్యానించారు.

మ‌రోవైపు.. కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌తో రాష్ట్ర మంత్రులు, ఎంపీలు భేటీ అయ్యారు. పార్లమెంట్‌లో గోయల్‌ను కలిసిన మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్‌రెడ్డి, పువ్వాడ అజయ్కుమార్, తెరాస ఎంపీలు కలిశారు. యాసంగి ధాన్యం కొనుగోలు చేయాలని కేంద్రమంత్రి పీయూష్గోయల్ను కోరారు. అయితే.. అనంతరం.. మంత్రి ఇలా వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం.