Begin typing your search above and press return to search.

కోదండం మాష్టారికి మరో లేఖాస్త్రం

By:  Tupaki Desk   |   7 March 2017 4:44 AM GMT
కోదండం మాష్టారికి మరో లేఖాస్త్రం
X
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై పోరు అంటే అంత చిన్న ముచ్చటేం కాదు. ఒక్కసారి లెక్క తేడా వచ్చినట్లు ఫిక్స్ అయి వార్ షురూ అయితే.. పరిణామాలు అంతకంతకూ మారిపోతుంటాయి. తాజాగా టీజేఏసీలో అలాంటి పరిస్థితే కనిపిస్తోంది. మొన్నటివరకూ తెలంగాణ రాష్ట్ర సర్కారుపై విమర్శల్ని సంధించిన టీజేఏసీ ఛైర్మన్ కోదండరాం.. నిరుద్యోగుల ఇష్యూపై ప్రభుత్వంపై నేరుగా నిరసన దాడికి సిద్ధం కావటం.. త్వరలో రాజకీయ పార్టీ ఏర్పాటు దిశగా ప్రయత్నాలు షురూ అయిన దశలో.. కేసీఆర్ తన ఆటను షురూ చేసినట్లుగా మాటలు వినిపిస్తున్నాయి.

అదే సమయంలో టీజేఏసీలో కోందండం మాష్టారిపై ధిక్కార స్వరం బయటకు రావటమే కాదు.. ఆయన తీరును నిశితంగా తప్పుపడుతూ.. జేఏసీ కన్వీనర్ పిట్టల రాజేందర్ పలు ఆరోపణలతో తెరపైకి రావటం తెలిసిందే. తాజాగా.. కోదండం మాష్టారిపై తాను చేసిన ఆరోపణలపై టీజేఏసీలో కీలకంగా వ్యవహరిస్తున్న పలువురు ఒక హోటల్లో సమావేశమై.. సుదీర్ఘంగా చర్చించుకోవటం ఆసక్తికరంగా మారింది.

ఈ మీటింగ్ కు పలు జిల్లాలకు చెందిన జేఏసీ నేతలు హాజరై.. కోదండరాంపై రవీందర్ అండ్ కోలు రాసిన లేఖపై చర్చించారు. అందులోని అంశాల్ని ఆమోదించటం ద్వారా.. ఇంతకాలం విమర్శలుగా ఉన్నవాటికి.. జేఏసీలో పలువురు నేతల మద్దతు ఉందన్న విషయాన్ని తేల్చేసినట్లైంది. ఇదే సమయంలో.. కోదండం మాష్టార్ని టార్గెట్ చేస్తూ.. మరో లేఖను సంధించారు. ఇందులో మాష్టారిపై మరిన్ని ఆరోపణలు చేయటం గమనార్హం.

టీజేఏసీ లక్ష్యానికి విరుద్ధంగా కోదండం మాష్టారు ప్రవర్తించారని లేఖలో ఆరోపించిన జేఏసీ నేతలు..జేఏసీ ఏ రాజకీయ పార్టీతో కలిసి పని చేయదని.. రాజకీయ పార్టీగా మారబోదని ప్రకటిస్తునే.. రాజకీయ నేతలతో కోదండం మాష్టారు అంటకాగుతున్నట్లుగా మండిపడ్డారు. రాజకీయ పార్టీ ప్రకటనను తరచూ ఎందుకు చేస్తున్నారో చెప్పాలంటూ డిమాండ్ చేసిన వారు.. తెలంగాణ ఉద్యమ సమయంలో పౌర.. ప్రజా సంఘాలు ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో మాట్లాడి వెళ్లిపోవటం మినహా కోదండం చేసింది ఏమైనా ఉందా? అంటూ సూటిగా ప్రశ్నించటం విశేషం.

ఉద్యమ సందర్భంగా పలువురు నష్టపోయారని.. కోదండం మాత్రం నష్టపోయిందేమీ లేదంటూ తప్పు పట్టిన వారు.. ఉద్యమకారుల్ని ఏ రోజు కూడా ప్రత్యేకంగా ప్రస్తావించిన సందర్భం లేదని లా పాయింట్ ఒకటి బయటకు తీశారు. రాష్ట్ర సాధనలో కీలక భూమిక పోషించిన మహిళల గురించి కోదండం ఎక్కడా ప్రస్తావించలేదన్న వారు.. ‘కోదండం అనుసరించి విధానాలతో ఉద్యమకారులు ఇబ్బందులు గురయ్యారు. ఇప్పటికైనా తీరుమార్చుకోండి. ఎంతసేపూ స్వీయ ఆస్తిత్వం కోసం పాకులాడటమేనా? తమ తమ అభిప్రాయాల్ని స్వేచ్ఛగా చెప్పే అవకాశాన్ని టీజేఏసీ నేతలకు ఎందుకు ఇవ్వరు?’’ అంటూ ప్రశ్నించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/