Begin typing your search above and press return to search.

శ్రీ‌కాకుళం జెడ్పీ : ప‌ద‌వి ఆమెది పెత్త‌నం ఆయ‌నది ? ఆజ్ కా రాజ్ సాయి రాజ్ !

By:  Tupaki Desk   |   17 March 2022 9:26 AM IST
శ్రీ‌కాకుళం జెడ్పీ : ప‌ద‌వి ఆమెది పెత్త‌నం ఆయ‌నది ? ఆజ్ కా రాజ్ సాయి రాజ్ !
X
శ్రీ‌కాకుళం జెడ్పీ పీఠం అనూహ్యంగా ద‌క్కించుకున్నారు పిరియా విజ‌య(వాస్త‌వానికి ఆమె పేరు మొద‌ట్లో వినిపించ‌లేదు). ఆమె భ‌ర్త పిరియా సాయిరాజు ఒక‌నాడు ఫ‌క్తు ఎర్ర‌న్నాయుడు (దివంగ‌త టీడీపీ నేత‌) భ‌క్తుడు. ఎర్ర‌న్న మ‌ర‌ణానంత‌రం మారిన ప‌రిణామాల నేప‌థ్యంలో విశాఖ జిల్లా కాంట్రాక్టరు కాస్త ఇటుగా వ‌చ్చిపూర్తిగా స్థిర‌ప‌డిపోయారు.

ఆ రోజు ఇచ్ఛాపురం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గెలిపించింది ఎర్ర‌న్నే! త‌రువాత ఆయ‌న రాజ‌కీయ ఉన్న‌తికి కార‌ణం అయింది కూడా ఎర్ర‌న్నే! త‌రువాత మాత్రం ఆయ‌న రాజ‌కీయ జీవితాన్ని ఇచ్చిన పార్టీని వ‌దిలి జ‌గ‌న్ గూటికి చేరారు.

స‌మైక్యాంధ్ర ఉద్య‌మాల్లో తీవ్ర ఉద్వేగాల‌కు లోనై ఓ సంద‌ర్భంలో ఆత్మ హ‌త్యా య‌త్నం కూడా చేసుకున్నారు. ఒంటిపై పెట్రోలు పోసుకుని నిప్ప‌టించుకునేందుకు విఫ‌ల య‌త్నం చేశారు. ఆ త‌రువాత ప‌రిణామాల నేప‌థ్యంలో మొన్న‌టి ఎన్నిక‌ల్లో ఇక్క‌డి టీడీపీ అభ్య‌ర్థి బెందాళం అశోక్ చేతిలో ఓడిపోయారు.

కాళింగ సామాజిక‌వర్గానికి చెందిన సాయి రాజుది ప్రేమ వివాహం.అయిన‌ప్ప‌టికీ ముఖ్యమంత్రి ఆ రోజు సాయిరాజుకు ఇచ్చిన మాట ప్ర‌కారం జెడ్పీ చైర్మన్ (క్యాబినెట్ మినిస్ట‌ర్ హోదాతో స‌మానం అయిన‌) ప‌ద‌వి ఇచ్చి గౌర‌వించారు.

ఇక ఇప్పుడు ఆమె (పిరియా విజ‌య‌) పాలన ఎలా ఉందో చూద్దాం.ముందుగా జెడ్పీలో కారుణ్య నియామ‌కాల విష‌య‌మై అనేక అవినీతి ఆరోప‌ణ‌లు ఎదుర్కొన్నారు సాయి రాజు దంప‌తులు.ఇందుకు కొన్ని ఆధారాలు కూడా ఉన్నాయి.

అదేవిధంగా కొందరు పంచాయ‌తీ రాజ్ ఇంజ‌నీర్లు కూడా తీవ్ర ఒతిళ్ల‌లో ప‌నిచేయాల్సి వ‌స్తోంద‌ని త‌మ‌కు ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని కోరినా కూడా ప‌ట్టించుకోలేదు అన్న ఆరోప‌ణ కూడా ఉంది. అంతేకాదు క‌లెక్ట‌ర్ ఏక‌ప‌క్ష నిర్ణ‌యాల కార‌ణంగా తాము ఎంత‌గానో క్షోభ ప‌డుతున్నామ‌ని పీఆర్ ఇంజినీర్లు చెప్పినా కూడ ఆమెలో చ‌ల‌నం లేదు. ఇంకా విధాన ప‌ర నిర్ణ‌యాల‌న్నీ భ‌ర్త‌వే కావ‌డంతో ప్ర‌తి చోటా ఆయ‌న హ‌వానే నడుస్తోంది.

గ‌తంలో టీడీపీ హ‌వాలో చౌద‌రి ధ‌న ల‌క్ష్మీ (ఈమె కూడా కాళింగ సామాజిక‌వ‌ర్గానికి చెందిన ప్ర‌తినిధే) చైర్మ‌న్ గా ఉన్న‌ప్పుడు కూడా ఆమె భ‌ర్త చౌద‌రి బాబ్జి ఇదే విధంగా న‌డుచుకునే వార‌న్న ఆరోప‌ణ‌లు లేదా అభియోగాలు ఉన్నాయి.మ‌ళ్లీ ఇప్పుడు ఇదే సీన్ రిపీట్ అవుతోంది. అధికారుల‌తో స‌మీక్ష‌లు కూడా పిరియా సాయిరాజ్ చేస్తున్నార‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. దీనిపై కొంద‌రు స‌భ్యులు అభ్యంత‌రం చెప్పినా స్వ‌ప‌క్షం నుంచి విమ‌ర్శ‌లు వ‌చ్చినా సాయిరాజ్ వినిపించుకున్న దాఖ‌లాలు లేవు.