Begin typing your search above and press return to search.

విమానంలో మంటలతో క్రాష్ ల్యాండింగ్ చేసిన పైలట్లు..

By:  Tupaki Desk   |   22 Jun 2022 6:00 PM IST
విమానంలో మంటలతో క్రాష్ ల్యాండింగ్ చేసిన పైలట్లు..
X
అమెరికాలోని మియామి అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘోర ప్రమాదం తప్పింది. ఎయిర్ పోర్ట్ రన్ వేపై ఓ విమానానికి ప్రమాదం జరిగింది. రెడ్ ఎయిర్ ప్లేన్ ఫ్రంట్ ల్యాండింగ్ గేర్ ఫెయిల్ అవ్వడం వల్ల విమానంలో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. ఆ సమయంలో ప్లేన్ లో 126 మంది ప్రయాణికులున్నారు.

విమానయాన చరిత్రలో ఇవాళ మరో ఘోర ప్రమాదం త్రుటిలో తప్పింది. అమెరికాలోని మియామి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో రన్ వేపై ల్యాండ్ అవుతున్న సమయంలో రెడ్ ఎయిర్ ఫ్లైట్ ఫ్రంట్ ల్యాండింగ్ గేర్ ఫెయిల్ అయింది. దీంతో ఒక్కసారిగా విమానంలో మంటలు చెలరేగాయి. అదుపుతప్పిన విమానం రన్ వే నుంచి పక్కకు జరిగి ప్లేన్ క్రేన్ టవర్, చిన్న భవనంతో సహా అనేక వస్తువులను ఢీకొట్టింది.

సాయంత్రం 5.30కు విమానం మియామి ఎయిర్ పోర్టులో ల్యాండ్ కావాల్సి ఉండగా, కొద్ది నిమిషాల ముందు ల్యాండింగ్ గేరు చెడిపోయినట్లు పైలట్లు గురించారు. క్రాష్ ల్యాండ్ చేయడం తప్ప మరో దారిలేని స్థితిలో పైలట్లు అత్యంత చాకచక్యంగా వ్యవహరించారు. లోపలున్న సిబ్బంది సమయస్ఫూర్తితో ఎమర్జెన్సీ ద్వారంగుండా ప్రయాణికులను కిందికి నెట్టేయడం, సమాయానికి ఫైర్ ఫైటర్లు చేరుకోవడంతో పెను ముప్పు తప్పింది. క్రాష్ ల్యాండై మంటల్లో చిక్కుకున్న విమానం ఏ క్షణమైనా పేలిపోవచ్చనే భయంతో ప్రయాణికులు పరుగులు తీస్తోన్న దృశ్యాలు వైరలయ్యాయి.

ఈ విమానంలో 126 మంది ప్రయాణికులున్నారు. ఈ ఘటనతో ముగ్గురు వ్యక్తులు స్వల్పంగా గాయపడ్డారు. వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.డొమినికన్ రిపబ్లిక్‌లోని శాంటో డొమింగో నుంచి వస్తున్న విమానం మియామిలో ల్యాండ్ అయ్యే సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనతో విమానంలో ఉన్న ప్రయాణికులు భయంతో వణికిపోయారు.

ఘటనాస్థలికి పరిశోధకుల బృందాన్ని పంపి.. ప్రమాదానికి గల కారణాలను దర్యాప్తు చేయించనున్నట్లు నేషనల్ ట్రాన్స్ పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ తెలిపింది. మరోవైపు ఈ ఘటనకు విమానం ఫ్రంట్ ల్యాండింగ్ గేర్ కూలిపోవడమే కారణమని మియామి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు అధికారులు తెలిపారు. ఈ ఘటన వల్ల మరికొన్ని విమానాల రాకపోకలకు అంతరాయం కలిగిందని వెల్లడించారు.

ఈ ఘటనలో గాయపడిన ప్రయాణికులు మినహా మిగతా వారిని విమానం నుంచి టెర్మినల్ వరకు బస్సుల తరలించారు. రెడ్ ఎయిర్ ప్లేన్ లో మంటలను మియామి అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తెచ్చారు.