Begin typing your search above and press return to search.

ప్రత్యేక హోదా సాధ్యం కాదేమోనని అనుకుంటున్నాను.. !

By:  Tupaki Desk   |   1 July 2020 1:30 PM GMT
ప్రత్యేక హోదా సాధ్యం కాదేమోనని అనుకుంటున్నాను.. !
X
మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్ , మోపిదేవి వెంకటరమణలు ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. మండలి చైర్మన్ కు రాజీనామా లేఖలను పంపారు. మండలి చైర్మన్ షరీఫ్ వీరి రాజీనామాలు ఆమోదించారు. సీఎం జగన్ ను కలిసి మంత్రి పదవులకు రాజీనామా లేఖలు అందించారు.

రాష్ట్ర మంత్రితోపాటు ఎమ్మెల్సీ పదవిని వదులుకొని వైసీపీ రాజ్యసభ సభ్యుడిగా కొత్తగా ఎన్నికైన పిల్లి సుభాష్ చంద్రబోస్ తాజాగా సీఎం జగన్ ను కలిసి వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాపై స్పందించారు. ప్రత్యేక హోదాపై సీఎం జగన్ ఎన్నో పోరాటాలు చేశారని.. హోదా సాధ్యం కాదేమోనని నాకు అనిపిస్తోందని తెలిపారు. కేంద్రం ఏదైనా సెకండ్ ఆప్షన్ ఇస్తుందేమో చూడాలని.. ఇది తన వ్యక్తిగత అభిప్రాయం అని పిల్లి సుభాష్ అన్నారు. అయితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైయస్ఆర్ పార్టీ మాత్రం ప్రత్యేక హోదా కోసం తీవ్రంగా పోరాడుతుందని ఆయన అన్నారు.

తన లాంటి సామాన్యుడు పార్లమెంట్ గడప తొక్కడం అసాధ్యమని.. అలాంటిది తనను పార్లమెంట్ కు పంపిస్తున్న సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపానన్నారు. మండలి రద్దు అయ్యేవరకు మంత్రిగా ఉండాలని జగన్ కోరారని.. కానీ తనకు పార్లమెంట్ వెళ్లాలని చిన్నప్పటి నుంచి కోరిక అని అందుకే మంత్రి పదవికి రాజీనామా చేశానని పిల్లి సుభాష్ తెలిపారు.

ఇక అసమ్మతి రాజేస్తున్న రఘురామకృష్ణం రాజుపై కూడా పిల్లి సుభాష్ స్పందించాడు. ఒకపార్టీ నుంచి ఎన్నికయ్యాక ఆ పార్టీకి కట్టుబడి ఉండాలని.. విధి విధానాలు అనుసరించాలని.. ఆయనపై వైసీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.