Begin typing your search above and press return to search.
సీఎం జగన్ పై సుప్రీంలో పిల్.. వేసిందెవరు?
By: Tupaki Desk | 16 Nov 2020 8:45 AM ISTఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టులో ధాఖలైంది. దీనికి సంబంధించిన విచారణ ఈ రోజు కోర్టు ముందుకు రానుంది. దేశంలోనే సెకండ్ సీనియర్ మోస్ట్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిపై ముఖ్యమంత్రి జగన్ చేసిన విమర్శల నేపథ్యంలో ఆయన్ను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించాలని కోరుతూ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిల్ పై అత్యున్నత న్యాయస్థానంలో ఈ రోజు విచారణ జరగనుంది. జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ నేతృత్వంలోని బెంచ్ విచారణ జరపనుంది. ఇందులో జస్టిస్ రమణకు వ్యతిరేకంగా ఆరోపణలు చేస్తూ.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ ఏ బాబ్డేకి ఎందుకు లేఖ రాశారన్న అంశంపై సుప్రీం వివరణ కోరుతుందని చెబుతున్నారు. ఇంతకీ ఈపిల్ దాఖలు చేసిందెవరు? అన్న విషయంలోకి వెళితే.. ముగ్గురు లాయర్లు పిల్ వేయటం గమనార్హం.
లాయర్లు జీఎస్ మణి.. ప్రదీప కుమార్.. ఎస్కే సింగ్ లు కలిసి ఈ పిల్ వేశారు. ఏపీ ముఖ్యమంత్రిజగన్మోహన్ రెడ్డిపై 20కి పైగా క్రిమినల్ కేసులు ఉన్నట్లుగా పేర్కొన్నారు. అందులో విదేశాలకు అక్రమంగా డబ్బు తరలింపు.. అవినీతి.. ఆదాయానికి మించిన ఆస్తులు.. తండ్రి అధికారాన్ని అడ్డుగా పెట్టుకొని లబ్థి పొందారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆ కేసులన్ని తీవ్రమైనవన్నది వారి వాదన.
అంతేకాదు.. ఎలాంటి ఆధారాలు లేకుండా దేశంలోనే రెండో సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ రమణపై ఆరోపణలు చేయటాన్ని వారు తప్పు పట్టారు. ఆధారాలు లేకుండా ప్రజల ముందు..మీడియా ముందుకు వచ్చి ఆరోపణలు చేయించారన్నారు. సీఎం జగన్ ను వెంటనే ఆ పదవి నుంచి తొలగించి.. చర్యలు తీసుకోవాలని కోరారు. అసత్య ఆరోపణలు చేయటం ద్వారా సీఎం జగన్.. న్యాయవ్యవస్థను మసకబార్చారని పేర్కొన్నారు. మరి.. ఈ పిల్ పై సుప్రీం ధర్మాసనం ఎలా స్పందిస్తుందో చూడాలి.