Begin typing your search above and press return to search.
జిహెచ్ ఎంసీ ఎన్నికలపై హైకోర్టులో పిల్..కోర్టు ఏంచెప్పిందంటే?
By: Tupaki Desk | 16 Nov 2020 4:00 PM ISTజీహెచ్ ఎం సీ ఎన్నికల నిర్వహణకు ముహుర్తం ఖరారు అవుతున్న దశలో ఎన్నికలు ఆపాలంటూ పిటిషన్ దాఖలయ్యింది. రిజర్వేషన్లలో రెగ్యూలర్ రొటేషన్ చేసేంత వరకు ఎన్నికలు ఆపాలంటూ బీజేపీ నేత, మాజీ డిప్యూటీ మేయర్ సుభాష్ చందర్ పిటిషన్ వేశారు. దాఖలైన పిల్ పై హైకోర్టు నేడు విచారణ చేపట్టింది. రెగ్యులర్ రొటేషన్ చేసేంత వరకు గ్రేటర్ ఎన్నికలు నిర్వహించొద్దని పిల్ లో పొందుపరిచారు. బీజేపీ మాజీ డిప్యూటీ మేయర్ సుభాష్ చందర్ పీల్ దాఖలు చేశాడు. పాత రీజర్వేషన్ పద్ధతి లోనే ఎన్నికలు నిర్వహిస్తున్నారని .. రీజర్వేషన్ల ను రొటేషన్ చేసి ఎన్నికలు నిర్వహించాలని పిటీషనర్ పిల్ లో పేర్కొన్నారు.
జీహెచ్ ఎం సీ చట్టానికి ఇది విరుద్ధమని, రిజర్వేషన్ పాలసీలోని 52ఈ కి విరుద్ధమని పిటిషనర్ వాదించారు. త్వరలో ghmc షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉందని అప్పటి వరకు స్టే ఇవ్వాలని రచనా రెడ్డి న్యాయస్థానాన్ని కోరారు. దీంతో జీహెచ్ ఎం సీ ఎన్నికలపై ధాఖలైన పిటీషన్ పై హైకోర్టు విచారణ చేపట్టింది. పిటిషనర్ తరుపు వాదనలు విన్న జస్టిస్ అభిషేక్ రెడ్డి… విచారణను చీఫ్ జస్టిస్ బెంచ్ కు కేసును బదిలీ చేశారు. దీనిపై మంగళవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దర్మాసనం విచారణ చేయనుంది. పిటిషనర్ తరుపున ప్రముఖ న్యాయవాది రచనారెడ్డి వాదనలు వినిపించారు. పాత రిజర్వేషన్ ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తున్నారని అభ్యంతరాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో పిల్ పై పిటిషనర్ తరపున న్యాయవాది తన వాదనలు వినిపించిన తరువాత హైకోర్టు ప్రభుత్వం తరపున న్యాయవాది వాదనలు విన్న తరువాత హైకోర్టు కీలక నిర్ణయం వెలువరించే అవకాశాలు ఉన్నాయి.