Begin typing your search above and press return to search.

పటాన్ చెర్వు ఎమ్మెల్యేకు పోటీ చేసే అర్హతే లేదా?

By:  Tupaki Desk   |   29 Sep 2019 5:32 AM GMT
పటాన్ చెర్వు ఎమ్మెల్యేకు పోటీ చేసే అర్హతే లేదా?
X
పాత వివాదమే కానీ కొత్తగా తెర మీదకు వచ్చింది. హైదరాబాద్ శివారు నియోజకవర్గమైన పటాన్ చెర్వు టీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిపై హైకోర్టులో దాఖలైన పిల్ ఇప్పుడు సంచలనంగా మారింది. కోర్టులో ఆయనపై దాఖలైన పిటిషన్ లోని విషయాలు కొత్త గుబులుకు కారణంగా మారాయి. 2015లో ఒక క్రిమినల్ కేసులో మహిపాల్ రెడ్డికి 2015లో రెండున్నరేళ్లు జైలుశిక్ష పడినట్లు పేర్కొన్నారు.

సంగారెడ్డి జేఎఫ్ ఎం కోర్టు మహీపాల్ రెడ్డికి రెండున్నరేళ్ల జైలు పడిందని.. క్రిమినల్ కేసులో జైలుశిక్ష పడిన వ్యక్తులకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉండదంటున్నారు. అయితే.. దిగువకోర్టు తీర్పుపై అప్పీలు చేసి మధ్యంతర ఉత్తర్వులు పొందారని సదరు పిల్ లో పేర్కొన్నారు. కిందికోర్టు విధించిన శిక్షను అప్పీల్ కోర్టు రద్దు చేయలేదని.. ఇలాంటి ఉదంతాల్లో ఆర్నెల్ల వ్యవధి అనంతరం ఆ కాలాన్ని పొడిగించుకోవాలని.. లేదంటే వాతంట అవే రద్దు అవుతాయని చెబుతున్నారు.

ఈ లెక్కన తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన నాటికే ఆయనకు పోటీ చేసే అర్హత లేదంటున్నారు. ఆయనకు పడిన శిక్షను రద్దు చేయకపోవటం.. తాత్కాలికంగా స్టే ఇచ్చిన అంశంలోని సాంకేతిక అంశాన్ని ప్రాతిపదికగా చేసుకొని వేసిన పిటిషన్ పై కోర్టు ఎలా రియాక్ట్ అవుతుందన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. ధీనికి సంబంధించి ఏ మాత్రం ప్రతికూల ఆదేశాలు వెల్లడైనా పటాన్ చెర్వు ఎమ్మెల్యే పరిస్థితి ఇబ్బందిగా మారుతుందన్న మాట వినిపిస్తోంది.