Begin typing your search above and press return to search.

వైరల్ పిక్: పంది కడుపున మనిషి.!

By:  Tupaki Desk   |   28 July 2018 5:30 PM GMT
వైరల్ పిక్: పంది కడుపున మనిషి.!
X
కాలజ్ఞానం నిజమవుతోందా.? బ్రహ్మంగారు చెప్పింది అక్షరాల అక్షరసత్యం అవుతోందా.? పంది కడుపున మనిషి జన్మించాడా.? భవిష్యత్తులో చోటుచేసుకోబోయే అద్భుతాలను ముందే ఊహించి చెప్పిన బ్రహ్మంగారి కాలజ్ఞానాన్ని ఇప్పటికీ చాలామంది నమ్ముతుంటారు. సునామీ వస్తుందని ఎప్పుడో శతాబ్ధాల కిందటే బ్రహ్మంగారు ఊహించారు పంది కడుపున మనిషి పుడుతాడని చెప్పారు. ఇప్పుడు పంది కడుపున మనిషి పుట్టాడనే వార్త కూడా ప్రచారంలోకి వచ్చింది.

తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ గా మారుతోంది. పంది కడుపున మనిషి పుట్టాడు అని వ్యాపింపచేస్తున్నారు. ముక్కు - చెవులు - చేతులు - కాళ్లు పందిని పోలి ఉండి.. మానవ దేహాన్ని కలిగియున్న శిశువు ఫొటో ఒకటి వాట్సాప్ - ఫేస్ బుక్ లలో విపరీతంగా వైరల్ అవుతోంది. చెట్ల పొదల్లో పడిఉన్న శిశువు పక్కన ఓ పంది ఉండడం కనిపిసిస్తోంది. కొందరమో గ్రాఫిక్స్ చేసి వదిలారంటున్నారు. మరికొందరు ఏదో దేశంలో నిజంగానే ఓ మహిళ కు ఈ వింత శిశువు జన్మించాడని అంటున్నారు.

అయితే ఈ ఫొటో ఎక్కడి నుంచి.. ఎలా వచ్చిందనే మాత్రం నిర్ధారణ లేదు. జన్యుపరమైన లోపాలతో పుట్టిన శిశువు అయి ఉండవచ్చని సైంటిస్టులు అనుమానిస్తున్నారు. ఏది ఏమైనా మన భక్తులు మాత్రం ఇది ఖచ్చితంగా బ్రహ్మంగారి కాలజ్ఞానం మహిమే అని కొనియాడుతున్నారు.