Begin typing your search above and press return to search.

ఫిలిప్పీన్స్ లో వింత: మనిషంతా గబ్బిలం ప్రత్యక్షం

By:  Tupaki Desk   |   4 July 2020 9:00 AM GMT
ఫిలిప్పీన్స్ లో వింత: మనిషంతా గబ్బిలం ప్రత్యక్షం
X
ఈ జీవ ప్రపంచంలో వింతలు అప్పుడప్పుడు కనిపిస్తుంటాయి. కొన్ని లోపాలు.. శరీరంలో జరిగే కొన్ని చర్యలతో వింత జీవులు కనిపిస్తుంటాయి. ప్రస్తుతం ఫిలిప్పీన్స్ దేశంలో ఓ వింత గబ్బిలం ప్రత్యక్షమైంది. దాదాపు మనిషంత సైజులో ఉండి కనిపించడంతో ఓ వ్యక్తి షాక్ కు గురయ్యాడు. వెంటనే దానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో పెట్టడంతో అవి వైరల్ గా మారాయి.

తలకిందులుగా వేలాడుతూ ఉన్న ఓ భారీ గబ్బిలం ఫిలిప్పైన్స్‌లోని అలెక్స్ అనే వ్యక్తికి ఎదురైంది. ఓ పాత ఇంటి ఆవరణలో భారీ గబ్బిలం తలకిందులుగా వేలాడుతూ కనిపించింది. దీనిని చూసిన అలెక్స్ ఆశ్చర్యపోయి వెంటనే తన ఫోన్‌లో దానిని ఫొటోలు తీశాడు. అనంతరం వాటిని తన ట్విటర్‌ ఖాతాలో పోస్ట్ చేశాడు. తన ఇంటి దగ్గరలో ఈ గబ్బిలం కనిపించిందని, దీని రెక్కలు దాదాపు 5.5 అడుగుల వెడల్పు ఉంటాయని తెలిపాడు. అలెక్స్ పెట్టిన పోస్టును కొన్ని గంటల్లోనే 2.63 లక్షల లైక్స్, 1.05 లక్షల రీట్వీట్స్ చేశారు.

ఈ అరుదైన గబ్బీలం వివరాలను అలక్స్ వివరించాడు. వీటిని జైంట్ గోల్డెన్ క్రౌన్డ్ ఫ్లైయింగ్ ఫాక్స్ అని పిలవబడే ఈ గబ్బిలాలు పూర్తి శాకాహారులని, కేవలం పండ్లను మాత్రమే తింటాయని, మాంసాహారం అసలు ముట్టవని అలెక్స్ ట్విట్టర్ లో వివరిస్తూ పోస్ట్ చేశారు.