Begin typing your search above and press return to search.

కన్నీళ్లు తెప్పించే ఫొటో.. అందుకే అవార్డుకు ఎంపికైంది

By:  Tupaki Desk   |   14 Oct 2020 2:00 PM IST
కన్నీళ్లు తెప్పించే ఫొటో.. అందుకే అవార్డుకు ఎంపికైంది
X
కొన్ని చిత్రాలు మనసును రంజింపజేస్తాయి. మరికొన్ని ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. కొన్ని అపురూప చిత్రాలు మాత్రం మన మనసులను కదిలిస్తాయి. కన్నీళ్లు తెప్పిస్తుంటాయి. అలా ప్రకృతి ప్రేమికులను ఎంతగానో ఆకట్టుకొని.. మూగజీవాల కష్టాలను కళ్లకు కట్టిన ఓ ఫొటో ఈ ఏడాది రాయల్ సొసైటీ ఆఫ్ బయాలజీ (ఆర్​ఎస్​బీ) ఫొటోగ్రఫీ పోటీలో మొదటి బహుమతిని గెలుచుకుంది. శ్రీలంకలోని చెత్త డంప్ నుంచి ఓ ఏనుగుల మంద ఆహారపదార్ధాలను ఏరుకొని తింటుండగా ఆ దృశ్యం ఓ ఫొటోగ్రాఫర్​ కంటపడింది. ఇంకే దాన్ని తన కెమెరాలో బంధించాడు. ఆ ఫొటో బయటకొచ్చిన క్షణం నుంచి ప్రకృతి ప్రేమికులను ఎంతో కదిలించింది. ప్రస్తుతం అవార్డును తెచ్చిపెట్టింది. ఫ్రీలాన్స్ ఫొటోగ్రాఫర్ తిలక్సన్ తర్మపాలన్ అంపారా జిల్లాలోని వన్యప్రాణుల అభయారణ్యం సమీపంలో ఈ ఫొటోను క్యాప్చర్​ చేశారు. అక్కడి ఏనుగుల దుస్థితిని ఏ చిత్రం కళ్లకు కట్టింది. ఇక్కడ ప్రతి సంవత్సరం వందలాది మంది ఏనుగులు వ్యర్థాలు తిని అనారోగ్యానికి గురై చనిపోతున్నాయి.


ఈ ఫొటోతో స్పందించిన అధికారులు ఏనుగులు సంచరించే ప్రదేశాల్లో చెత్తను వేయడాన్ని నిషేధించారు. అయితే ఈ ఏడాది రాయల్​ సొసైటీ ఆఫ్​ బయాలజీ అనేక ఫొటోలను పరిశీలించగా ఈ ఫొటో మొదటి బహుమతికి ఎంపికైంది. ఈ ఫొటోకు 1,000 డాలర్లు (రూ.72వేలుపైనే) ప్రైజ్ మనీ లభించింది. ‘నేను ఈ అవార్డు గ్రహీత అయినందుకు గర్వపడుతున్నాను. ఫొటోగ్రాఫర్లలో ఈ అవార్డు నా ఆత్మవిశ్వాసాన్ని మెరుగుపరుస్తుంది. నా భవిష్యత్ ప్రాజెక్టులకు మరిన్ని బాధ్యతలను ఇస్తుంది’ అంటూ ఫొటోగ్రాఫర్ తర్మపాలన్ ట్వీట్ చేశారు. ఈ ఫొటోను షేర్ చేసిన తరువాత నెటిజన్ల నుండి ప్రశంసలను అందుకున్నారు. ప్రస్తుతం జంతుప్రేమికులంతా తర్మపాలన్​ను అభినందిస్తున్నారు.