Begin typing your search above and press return to search.

పనోళ్ల మీద ఆ దేశాధ్యక్షుడి చేష్టలు చూస్తే ఛీ.. ఛీ.. అనాల్సిందే

By:  Tupaki Desk   |   31 March 2021 11:00 AM IST
పనోళ్ల మీద ఆ దేశాధ్యక్షుడి చేష్టలు చూస్తే ఛీ.. ఛీ.. అనాల్సిందే
X
తరచూ వివాదాల్లోకి కూరుకుపోయే దేశాధ్యక్షుల జాబితాలో ఫిలిఫ్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో ఒకరు. తరచూ ఏదో ఇష్యూలో ఆయన పేరు వినిపిస్తూ ఉంటుంది. తాజాగా తన 76వ పుట్టిన రోజు సందర్భంగా ఇంట్లో పని చేసే సహాయకులతో వ్యవహరించిన తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిపి పుట్టిన రోజు వేడుకల్నిజరుపుకున్నారు. ఈ సందర్భంగా ఇంట్లోని వారు క్యాండిల్ వెలిగించిన కేకు తీసుకొచ్చారు. దీంతో.. ఆ క్యాండిల్ ను ఊదారు.

అనంతరం ఇంటి సహాయకురాలు మరో కప్ కేక్ లాంటి దానిపై క్యాండిల్ వెలిగించి ఆయన వద్దకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఆమెను ఆటపట్టించే విషయంలో అధ్యక్షుల వారు వ్యవహరించిన తీరు వివాదానికి కారణమైంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న ఈ వీడియో ఇప్పుడు పెద్ద వవాదంగా మారి.. దేశాధ్యక్షుడి తీరును తీవ్రంగా తప్పు పడుతున్నారు.

ప్రజల్లో ఏర్పడిన వ్యతిరేకత నేపథ్యంలో డ్యామేజ్ కంట్రోల్ చర్యల్ని చేపట్టింది అధ్యక్ష భవనం. ఎలాంటి చెడు ఉద్దేశంతో దేశాధ్యక్షుల వారు వ్యవహరించలేదని.. కుటుంబ సభ్యులంతా ఉన్న వేళలోనే ఆయన చేసిన పనిని జోక్ గా తీసుకోవాలే కానీ తప్పుగా చూడకూడదని వివరణ ఇచ్చారు. అధ్యక్షులు వారికి జోకులు అంటే సరదా అని.. ఆ క్రమంలోనే ఆయన అలా చేశారే తప్పించి.. తప్పుడు ఆలోచనలతో కాదని సర్దిచెప్పే ప్రయత్నం చేసింది. అయినప్పటికి వీడియో చూసినోళ్లంతా మాత్రం తిట్టిపోస్తుండటం గమనార్హం.