Begin typing your search above and press return to search.

చదివింది పీహెచ్​డీ.. చేసేది డ్రగ్స్​ దందా..!

By:  Tupaki Desk   |   13 Dec 2020 1:38 PM IST
చదివింది పీహెచ్​డీ.. చేసేది డ్రగ్స్​ దందా..!
X
ఉన్నతచదువులు చదివిన ఓ విద్యావంతుడు అడ్డదారి పట్టాడు. తన పరిజ్ఙానాన్ని తప్పుడు పనులు చేసేందుకు వాడాడు. కెమిస్ట్రీలో పీహెచ్​డీ చేసి డ్రగ్స్​ దందా మొదలుపెట్టాడు. ముంబై మాఫియాతో చేతులు కలిపి గలీజ్​ వ్యాపారం మొదలుపెట్టాడు. ఎట్టకేలకు పోలీసులకు చిక్కి ఊచలు లెక్కిస్తున్నాడు. సొంతంగా ఓ ప్రయోగశాలను ఏర్పాటుచేసుకొని డ్రగ్స్​ తయారు చేశాడు.

హైదరాబాద్​కు చెందిన ఓ వ్యక్తి కెమిస్ట్రీలో పీహెచ్​డీ చేశాడు. కొంతకాలంపాటు ఓ ఫార్మాకంపెనీలో ఉద్యోగం చేశాడు. కానీ అత్యాశకు పోయి భారీగా డబ్బులు సంపాదించాలన్న మోజుతో ముంబై మాఫియాతో చేతులు కలిపాడు. సొంతంగా ఓ ల్యాబ్​ను పెట్టుకొని మెఫిడ్రిన్‌ను తయారుచేస్తున్నాడు. అయితే డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ) అతడిని పక్కా సమాచారంతో అరెస్ట్​చేసింది. అతడి వద్ద దాదాపు 219.5 కిలోల ముడి మెఫిడ్రిన్‌ దొరికినట్టు సమాచారం. దీనివిలువ రూ.63.12 లక్షలు. శుక్రవారం 3.156 కిలోల మెఫిడ్రిన్‌ను మరోవ్యక్తికి విక్రయిస్తుండగా అధికారులు రెడ్​హ్యాండెడ్​గా పట్టుకున్నారు.

ఈ మధ్యకాలంలో ఇంత భారీగా డ్రగ్స్​పట్టుబడటం ఇదే తొలిసారి. అతడి ల్యాబ్​ అధునాతన పరికరాలు చూసి అధికారులే షాక్​ అయ్యారు. ఇప్పటివరకు దాదాపు 100 కిలోల డ్రగ్స్​ తయారుచేసి విక్రయించినట్టు సమాచారం. దీని విలువ కోట్లల్లోనే ఉంటుంది. ఈ ఘటనపై అధికారులు కూపీ లాగుతున్నారు. హైదరాబాద్​లో ఇటువంటి వ్యక్తులు ఇంకా ఉన్నారా అనే విషయంపై ఆరా తీస్తున్నారు.