Begin typing your search above and press return to search.
ఫైజర్ వ్యాక్సిన్: బ్రిటన్‌లో సైడ్ఎఫెక్ట్స్.. అమెరికాలో రిపీట్..
By: Tupaki Desk | 18 Dec 2020 8:45 AM ISTఇప్పుడు ప్రపంచంలోనే చాలా సేఫ్, ప్రభావవంతంగా పనిచేసే వ్యాక్సిన్ ఏదన్నా ఉందంటే అది అమెరికాకు చెందిన ఫైజర్ వ్యాక్సిన్ మాత్రమే. క్లినికల్ ట్రయల్స్ లో ఆ వ్యాక్సిన్ చాలా వరకు మంచి ఫలితాలు ఇచ్చిందని చెబుతూ వస్తున్నారు. తొలి వ్యాక్సిన్ మాదే నంటూ రష్యా స్పుత్నిక్-వి వ్యాక్సిన్ ను ప్రకటించినప్పటికీ అదంత ఎఫెక్టివ్ గా పని చేయడం లేదు. అయితే ఆ టీకా రెడీ అయినప్పటి నుంచి అందరూ దాని పై సందేహాలు లేవనెత్తిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం అందుబాటు లో ఉన్న వ్యాక్సిన్ల లో ఫైజర్ వ్యాక్సినే టాప్. అయితే ఈ వ్యాక్సిన్‌కు కూడా కొన్ని సైడ్ఎఫెక్ట్ కనిపిస్తున్నాయి. అయితే వాటిని చూసి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్య నిపుణులు అంటున్నారు. బ్రిటన్‌లో కొన్ని వారాల క్రితమే ఫైజర్ వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభించారు. అక్కడ వ్యాక్సిన్ తీసుకున్న ఇద్దరిలో అలర్జీ లక్షణం కనిపించింది. తాజాగా అమెరికా లోనూ అదే పరిస్థితి నెలకొన్నది. ఇక్కడ వ్యాక్సిన్ తీసుకున్న కొంత మందికి బ్రిటన్ లో వచ్చినట్టే అలర్జీ లక్షణాలు కనిపించాయి.
వారికి కొన్ని నిమిషాలపాటు శ్వాసతీసుకోవడం లో ఇబ్బంది, కళ్లకింద వాపు, గొంతునొప్పి, వంటి లక్షణాలు కనిపించాయి. అయితే ఈ విషయంపై అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ స్పందించింది. ‘అమెరికాలో ప్రస్తుతం వ్యాక్సిన్ అద్భుతంగా పనిచేస్తున్నది. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అతి తక్కువ మందిలో చిన్నపాటి సైడ్ఎఫెక్ట్స్ కనిపిస్తున్నాయి. ఏ వ్యాక్సిన్ కయినా ఇటువంటివి సాధారణమే.’ అని అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ భరోసా ఇచ్చింది. అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ శుక్రవారం వ్యాక్సిన్ తీసుకోనున్నారు. ప్రజల్లో భరోసా కల్పించేందుకే ఆయన వ్యాక్సిన్ తీసుకుంటున్నట్టు సమాచారం.