Begin typing your search above and press return to search.

కరోనా వ్యాక్సిన్ ...జస్ట్ 28 రోజుల్లోనే .. !

By:  Tupaki Desk   |   7 Dec 2020 4:30 PM GMT
కరోనా వ్యాక్సిన్ ...జస్ట్ 28 రోజుల్లోనే .. !
X
ప్రపంచంలోని తొలి కరోనా వ్యాక్సిన్ కు అనుమతి లభించింది. ఫైజర్ బయోన్టెక్ కోవిడ్ వ్యాక్సిన్ ను యూకే ఆమోదించింది. ఎంహెచ్ ఆర్ ఏ నిబంధనల ప్రకారం వ్యాక్సిన్ కు ఆమోదముద్ర వేసింది బ్రిటన్ ప్రభుత్వం.యూకే ప్రభుత్వం ఫైజర్ వ్యాక్సిన్ కు ఆమోదముద్ర వేయడంతో మంగళవారం యూకేలో వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుందని ఫైజర్ తెలిపింది. డిసిన్స్ అండ్ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ ప్రకారం ఈ వ్యాక్సిన్ 95 శాతం రక్షిస్తుంది.

ఇక భారత్‌ లోనూ అత్యవసర వినియోగానికి అనుమతి ఇవ్వాలంటూ ఆ కంపెనీ దరఖాస్తు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఒకవేళ ప్రభుత్వం కనుక అనుమతిస్తే, అది ఎలా పనిచేస్తుంది అన్నది మనకు తెలియాలిగా ఈ టీకాను అక్స్‌ఫర్డ్, మోడెర్నా లాంటి వాటిలా కాకుండా ... 70డిగ్రీల ఉష్ణోగ్రతలో నిల్వ చేయాల్సి ఉంటుంది.. రెండు డోసులు తీసుకోవాలి. ఒక్కో డోసు ధర రూ.1,500. అయితే, 28 రోజులు చాలు. కరోనా వైరస్‌ కు వ్యతిరేకంగా మన శరీరంలో పూర్తి స్థాయిలో రోగ నిరోధక వ్యవస్థ అభివృద్ధి చెందుతుందని చెబుతున్నారు. మొదటి రోజు.. తొలి డోస్‌ వేయగానే ,12వ రోజుకి శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ అభివృద్ధి చెందడం ప్రారంభమవుతుంది. ఇక 21వ, రోజు రెండో డోస్ తీసుకోవాలి. ఆ తర్వాత ‌ 28వ రోజు పూర్తి స్థాయిలో రోగనిరోధక వ్యవస్థ అభివృద్ధి చెందుతుంది.

మాస్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమం తొలిజాబితాలో క్వీన్‌ ఎలిజబెత్ ప్రిన్స్‌ ఫిలిప్‌ కూడా ఉండనున్నారు. వయసు కారణంగా మొదటి జాబితాలో వీరికి స్థానం కల్పించారు. బెల్జియం నుంచి వచ్చిన తొలి బ్యాచ్‌లో 8,00,000 మోతాదులు ఉన్నాయి. ఫైజర్ వ్యాక్సిన్ యొక్క 40 మిలియన్ మోతాదులను బ్రిటన్‌ ప్రభుత్వం ఆదేశించింది. ఇది 20 మిలియన్ల ప్రజలకు 21 రోజుల వ్యవధిలో రెండు టీకాలు వేయడానికి సరిపోతుంది. రెగ్యులేటర్లు ఆమోదించినప్పుడు 300 మిలియన్ల మోతాదు కుపైగా ఇతర టీకాలకు ముందస్తు ప్రాప్యత కోసం కూడా ఒప్పందం కుదుర్చుకుంది. 70, 80 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద వ్యాక్సిన్లను 50 దవాఖానల్లో నిల్వ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. తొలి జాబితాలోనే క్వీన్ ఎలిజబెత్, ప్రిన్స్ ఫిలిప్‌ లకు వ్యాక్సిన్‌ అందిస్తారని ఆదివారం బ్రిటిష్ పత్రికలలో వార్తలు వచ్చాయి. డిసెంబర్‌ 2వ తేదీన యూకే రెగ్యులేటర్‌ ఆమోదించనట్లుగా ఫ్రంట్‌లైన్ ఆరోగ్య సిబ్బంది, 80 ఏండ్ల వయసు పైబడిన వారు, కేర్ హోమ్ వర్కర్లకు వ్యాక్సిన్‌ ను అందజేస్తారు.