Begin typing your search above and press return to search.

'ఫైజర్​' వేసినా కరోనా .. టీకా పనితీరుపై నీలినీడలు.!

By:  Tupaki Desk   |   30 Dec 2020 1:02 PM GMT
ఫైజర్​ వేసినా  కరోనా .. టీకా పనితీరుపై నీలినీడలు.!
X
ఫైజర్​ వ్యాక్సిన్​ పనితీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికాకు చెందిన ప్రముఖ ఫార్మాసూటికల్స్ సంస్థ ఫైజర్​ .. జర్మనీకి చెందిన బయోఎన్‌టెక్‌ సంయుక్తంగా ఈ వ్యాక్సిన్​ను తయారుచేసిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు వచ్చిన వ్యాక్సిన్లలో ఫైజర్​ వ్యాక్సిన్​ అత్యుత్తమమైందని.. సైడ్​ఎఫెక్ట్స్​ లేకుండా మెరుగైన ఫలితాలు ఇవ్వగల వ్యాక్సిన్​ ఇదొక్కటే నని ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు దక్కాయి. మరోవైపు యూరప్​, ఇజ్రాయెల్​, కెనడా సహా అనేక దేశాలు ఈ వ్యాక్సిన్​ డోసులకు ఆర్డర్లు ఇచ్చాయి. ఈ నేపథ్యంలో ఫైజర్​ వ్యాక్సిన్​ పనితీరుపై ప్రస్తుతం కొంత గందరగోళం నెలకొన్నది. ఇప్పటికే అమెరికాలో వ్యాక్సినేషన్ మొదలుపెట్టారు. అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ​ కూడా తొలి డోసు వ్యాక్సిన్​ తీసుకున్నారు. మరోవైపు వ్యాక్సినేషన్​ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది.

తొలిదశలో వైద్యశాఖ సిబ్బంది. 70 ఏళ్లు పైబడ్డ వారికి వ్యాక్సిన్​ ఇస్తున్నారు. అయితే ఇటీవల శాన్‌డియాగోలోని ఆసుపత్రిలో మాథ్యూ డబ్ల్యూ అనే నర్సుకు ఈ నెల 18వ తేదీన ఫైజర్ వ్యాక్సిన్ ఇచ్చారు. అయితే ఆ తర్వాత ఆమె అనారోగ్యానికి గురైంది. చలి, జ్వరం, దగ్గు వచ్చాయి. దీంతో ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు. అయితే ఆ నర్సుకు పరీక్షలు చేయగా కరోనా పాజిటివ్​గా నిర్ధారణ అయ్యింది.

దీంతో వ్యాక్సిన్​ తీసుకున్న నర్సుకు పాజిటివ్​ రావడం ఏమిటని ఆందోళన నెలకొన్నది. అయితే ఈ ఫైజర్​ వ్యాక్సిన్​ను రెండు డోసులుగా ఇస్తున్నారు. సదరు నర్సుకు రెండు డోసులు ఇచ్చారో తెలియదు. అయితే ఇప్పటివరకు లక్షల సంఖ్యలో వ్యాక్సిన్లు పంపిణీ చేశారు. అయితే ఈ వ్యాక్సిన్​ పని తీరుపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యనిపుణులు అంటున్నారు.