Begin typing your search above and press return to search.

కరోనాకు ఆ ఫార్మా కంపెనీ మందు కనిపెట్టిందా?

By:  Tupaki Desk   |   4 March 2020 9:46 AM IST
కరోనాకు ఆ ఫార్మా కంపెనీ మందు కనిపెట్టిందా?
X
ప్రపంచాన్ని షేక్ చేస్తున్న కరోనా వైరస్ కు ముకుతాడు వేయటం ఇప్పుడో సవాలుగా మారింది. చైనాలో మొదలైన ఈ పిశాచి వైరస్ అంతకంతకూ విస్తరిస్తూ.. అరవైకి దేశాలకు పాకింది. దీంతో.. ఎప్పుడు.. ఏ రూపంలో ఈ వైరస్ తమ మీద విరుచుకుపడుతుందన్న ఆందోళనలో ఆయా దేశాల ప్రజలున్నారు. శాస్త్ర సాంకేతికత ఇంతలా డెవలప్ అయిన తర్వాత కూడా.. కరోనా లాంటి మొండి ఘటాన్ని కంట్రోల్ చేసే వ్యాక్సిన్ ను కనుగొనకపోవటం ఏమిటన్న ప్రశ్న పలువురి నోట వినిపిస్తోంది.

రోజులు గడుస్తున్న కొద్దీ ఈ మహమ్మారి కారణంగా మరణిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. వ్యాక్సిన్ ను కనుగొనేందుకు ప్రముఖ ఫార్మా కంపెనీలతో పాటు.. ప్రపంచ వ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నా ఇప్పటి వరకూ సరైన వ్యాక్సిన్ ను కనుగొన్నది లేదు. ఇలాంటివేళ.. తీపి కబురును చెప్పింది ప్రముఖ ఫార్మా కంపెనీ ఫైజర్. న్యూయార్క్ కేంద్రంగా పని చేసే ఈ అమెరికన్ కంపెనీ తాజాగా ఒక అడుగు ముందుకు వేసినట్లుగా చెబుతున్నారు.

కరోనాను కట్టడి చేసే యాంటీ వైరల్ కాంబినేషన్ ను తయారు చేయటంలో తాము సక్సెస్ అయినట్లుగా చెబుతున్నారు. అయితే.. తాము కనుగొన్న డ్రగ్ కాంబినేషన్ల వివరాల్ని త్వరలో ప్రకటిస్తామని సదరు కంపెనీ వెల్లడించింది. అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది చివరి నాటికి కరోనా మెడలు వంచే మందును మార్కెట్లోకి తీసుకొచ్చే అవకాశం ఉందని చెప్పక తప్పదు.

కరోనా నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ .. దేశంలోని అతి పెద్దదైన ఫార్మా కంపెనీల సీఈవోలతో భేటీ అయ్యారు. కరోనా టీకాల్ని రూపొందించటంలో తాము ఇతర దేశాలతో కలిసి పని చేస్తామని ట్రంప్ వెల్లడించారు. కరోనా టీకా తయారీ పై అమెరికన్ ఫార్మా కంపెనీలు ప్రయత్నాల్ని మరింతగా పెంచినట్లుగా ఆయన చెబుతున్నారు. మరి.. ట్రంప్ మాటలు ఎంతవరకు నిజమన్నది కాలమే తేల్చాల్సి ఉంటుంది.