Begin typing your search above and press return to search.

కరోనా వ్యాక్సిన్​తో కాసులవర్షం.. అడ్రస్​లేని కంపెనీల షేర్లు అమాంతం పైకి!

By:  Tupaki Desk   |   12 Dec 2020 3:45 AM GMT
కరోనా వ్యాక్సిన్​తో కాసులవర్షం.. అడ్రస్​లేని కంపెనీల షేర్లు అమాంతం పైకి!
X
ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా కరోనా వ్యాక్సిన్​పైనే చర్చ జరుగుతోంది. ఈ వ్యాక్సిన్లు ఎంతమేర ప్రభావంతంగా పనిచేస్తాయి. కరోనాను సమూలంగా తరిమేస్తాయా? లేదా? అన్న విషయం మరికొద్ది రోజల్లో తేలిపోనుంది. అయితే కరోనా వ్యాక్సిన్లు మాత్రం కొన్ని కంపెనీలకు భారీ లాభాలు తెచ్చిపెట్టనున్నాయట. ఇప్పటివరకు ఉనికిలో కూడా లేని పలు కంపెనీలు వ్యాక్సిన్​ దెబ్బకు ఎక్కడికో వెళ్లిపోయాయి. వాటి షేర్లు అమాంతం పెరిగాయి. భారీ లాభాలు వచ్చిపడుతున్నాయి.

వ్యాక్సిన్​ తయారీలో ప్రస్తుతం టాప్​లో దూసుకుపోతున్న కంపెనీలు ఫైజర్​, మోడెర్నా. ఈ రెండు కంపెనీలు కేవలం కరోనా వ్యాక్సిన్​తోనే ఈ ఏడాది 32 బిలియన్​ డాలర్ల సంపాదిస్తాయని టాక్​. ఈమేరకు అమెరికాకు చెందిన ప్రముఖ మీడియా సంస్థ వాల్​స్ట్రీట్​ జర్నల్​ ఓ కథనం ప్రచురించింది. ఫైజర్​ కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా కొంత పేరు ఉంది. కానీ మోడెర్నా మాత్రం కరోనా వ్యాక్సిన్​కు ముందు ఎవరికీ తెలియదు.

ఈ ఏడాది (2020) లో మోడెర్నా పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతోంది. ఫైజర్​ కంపెనీ కరోనా వ్యాక్సిన్​ కోసం జర్మన్​కు చెందిన బయోఎన్​టెక్​తో చేతులు కలిపింది. వ్యాక్సిన్​ ద్వారా వచ్చే ఆదాయాన్ని ఈ రెండు కంపెనీలు షేర్​ చేసుకోనున్నాయి. ఇప్పటివరకు ప్రపంచంలో అత్యంత సక్సెస్​ అయిన వ్యాక్సిన్​ ఫైజర్​ మాత్రమే. ఈ వ్యాక్సిన్​కు ఇప్పటకే బ్రిటన్​లో అనుమతులు వచ్చాయి. అమెరికాలో త్వరలోనే రానున్నాయి.

2022, 2023లలో మొత్తం కొవిడ్ వ్యాక్సిన్ ఆదాయంలో ఫైజర్ వాటా 9.3 బిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే ఫైజర్​ ఇప్పటికే పెద్ద కంపెనీ కాబట్టి దాని షేర్లు ఎక్కువగా ఏమి పెరగలేదు. కానీ ఎవరికీ తెలియని మోడెర్నా కంపెనీ మాత్రం దాదాపు 700 శాతం షేర్లు పెంచుకున్నది.