Begin typing your search above and press return to search.
దయచేసి వినండి: పెట్రోల్ బంకులు బంద్
By: Tupaki Desk | 29 Sept 2015 9:27 PM ISTఅక్టోబర్ 1 సందర్భంగా పెట్రోల్ బంక్ లు బంద్ చేస్తున్నారు. అక్టోబర్ ఒకటో తేదీకి అంత ప్రత్యేకత ఏముంది? ఎంత విశేషం ఉన్నా బంక్ లు బంద్ చేస్తారా అనుకుంటున్నారా? అయితే ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ ఆఫ్ పెట్రోలియం ట్రేడర్స్ వారి వాదన వినాల్సిందే. ఆంధ్రప్రదేశ్ పెట్రోలియం ట్యాంక్ ట్రక్ ఆపరేటర్స్ అసోసియేషన్ - ది ఆంధ్రప్రదేశ్ లారీ ఓనర్స్ అసోసియేషన్ మద్దతుతో జేఏసీగా ఏర్పడింది. డీజిల్ - పెట్రోల్ పై అధనంగా పెంచిన వ్యాట్ ను రద్దు చేయాలనేది ఈ జేఏసీ ప్రధాన డిమాండ్. జూన్ 9, 2015న జాయింట్ యాక్షన్ కమిటీ తరపున ఆయా డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయింది. అయినా... ప్రభుత్వం ఎలాంటి స్పందన లేదు, తగు విధమైన చర్యలు తీసుకోలేదు.
దీంతో ప్రభుత్వ తీరును నిరసిస్తూ అక్టోబర్ 1న ఉదయం 6 గంటల నుంచి పెట్రోల్ బంకుల నిరవధిక బంద్ ను పాటించనున్నట్లు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.గోపాలకృష్ణ తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ సమస్యలను పరిష్కరించే వరకు మన రాష్ట్రంలోని సరుకు రవాణా వాహనాలు, పెట్రోలు - డీజిల్ రవాణా వాహనాలు - పెట్రోలు బంకుల కార్యకలాపాలను నిలిపేస్తున్నామని స్పష్టం చేశారు. ఆల్ ఇండియా మోటారు ట్రాన్స్ పోర్టు కాంగ్రెస్ పిలుపు మేరకు దేశంలోని రవాణా వాహనాలన్నీ బంద్ లో పాల్గొంటున్నట్లు ఆయన తెలిపారు.
సో...మన వాహనాలన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ ట్యాంక్ ఫుల్ చేసి పెట్టుకోవాల్సిందే. ఎందుకంటే బండి లేనిదే బయటకు వెళ్లలేని పరిస్థితి! అటువైపు చూస్తే.... సంఘాలు బెట్టుగా ఉంటే....ప్రభుత్వం అంతకంటే మొండిగా ఉంది. అందుకే సెప్టెంబర్ 30న ఫుల్ ట్యాంక్ చేసుకొని పెట్టుకోండి.