Begin typing your search above and press return to search.
దాయాది సంచలనం.. లీటరు పెట్రోల్ లో రూ.20 తగ్గింపు
By: Tupaki Desk | 1 May 2020 10:30 AM ISTదాయాది సర్కారు సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. కరోనా కారణంగా ప్రపంచంలోని పలు దేశాల్లో ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైంది. ఆర్థికంగా బలంగా లేని దేశాల్లో పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఆర్థిక పరిస్థితి కోలుకోవటానికి వీలుగా ఆయా దేశాలు.. వినూత్న ఆలోచనలు చేస్తున్నాయి. పన్నుల పోటు పెంచటంతో పాటు.. అనవసర ఖర్చుల్ని తగ్గించుకునే పనిలో పడ్డాయి. ఇలాంటివేళ.. ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయ వనరుగా మారాయి పెట్రోల్.. డీజిల్ అమ్మకాలు. వీటి అమ్మకాలతో ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయం లభిస్తోంది.
ఇదిలా ఉంటే.. తాజాగా పాకిస్తాన్ లీటరు పెట్రోల్ మీద రూ.20 తగ్గిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పడిపోయిన నేపథ్యంలో దాని లాభాన్ని ప్రజలకు బదిలీ చేస్తూ.. ఇమ్రాన్ ఖాన్ సర్కారు కీలక నిర్ణయాన్ని తీసుకుంది. కరోనా నేపథ్యంలో ప్రపంచంలోని పలు దేశాలు లాక్ డౌన్ ను ప్రకటించటంతో క్రూడ్ ఆయిల్ వినియోగం భారీగా తేడా వచ్చిది. ప్రపంచ వ్యాప్తంగా ముడిచమురు డిమాండ్ పడి పోయింది.దీంతో.. ధర విపరీతంగా తగ్గింది. ఒక దశలో నెగిటివ్ ప్రైస్ రావటం సంచలనంగా మారింది. క్రూడ్ ఆయిల్ ధరల్ని అంతకంతకూ తగ్గిపోతున్న వేళ.. ఆ ప్రయోజనాన్ని ప్రజలకు అందేలా చేయటం కోసం లీటరు పెట్రోల్ పైన రూ.20 తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని పాక్ కు చెందిన ప్రముఖ మీడియా సంస్థ డాన్ ప్రచురించింది.
పాకిస్థాన్ లో ధరలు తగ్గించిన తర్వాత ఆ దేశంలో హైస్పీడ్ డీజిల్ ధర లీటరు రూ.33.94కు పడిపోతుందని చెబుతున్నారు. అదే సమయంలో లీటరు పెట్రోల్ మీద రూ.20.68మొత్తం తగ్గుతున్నట్లు చెబుతున్నారు. ఇదే నిజమైతే.. ఇలాంటి సాహసోపేతమైన నిర్ణయాన్ని మోడీ సర్కారు ఎందుకు తీసుకోనట్లు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఆర్థికంగా అంత బలంగా లేని పాక్ లోనే పెట్రోల్ ధరను ఇంతలా తగ్గించేసిన నేపధ్యం లో మోడీ సర్కారు మీద ఒత్తిడి పెరగటం ఖాయమని చెప్పక తప్పదు.