Begin typing your search above and press return to search.
మోడీ ఉన్నంతవరకు పెట్రోలు మండుతూనే ఉండాలి
By: Tupaki Desk | 14 March 2020 5:30 PM ISTఅంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గడంతో, మన దేశంలోనూ పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గతాయని ఆశగా ఎదురుచూసిన జనం నోట్లో కేంద్రం మట్టికొట్టింది. మోడీ ప్రతి ఒక్కరు వాడే పెట్రోలు, డీజిలుపై పగపట్టారు. ప్రపంచమంతటా పెట్రోలు ధరల తగ్గుదలను ప్రజలు ఎంజాయ్ చేస్తుంటే... ఒక్క మన దేశంలో మాత్రమే అవి మోడీ ఉండగా తగ్గేలా కనిపించడం లేదు.
కేంద్రం ఓ చేత్తో ఇచ్చినట్లే ఇచ్చి, మరో చేత్తో లాక్కుంటోంది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరల తగ్గుదల ద్వారా వచ్చే లాభాన్ని, ప్రజలకు పంచకుండా తన ఖాతాలోనే వేసుకుంటోంది. పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు 3 రూపాయలు చొప్పున పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెట్రోల్‌పై స్పెషల్ ఎక్సైజ్ డ్యూటీని లీటరుకు 2 రూపాయల నుంచి 8 రూపాయలుకు, డీజిల్ విషయంలో 4 రూపాయలకు పెంచినట్లు నోటిఫికేషన్ ఇచ్చింది. దీనికితోడు, పెట్రోల్‌పై రోడ్ సెస్సును లీటరుకు ఒక రూపాయి చొప్పున కేంద్రం పెంచింది.
అంతర్జాతీయ మార్కెట్ లో ముడిచమురు ధరలు 23 ఏళ్ల కనిష్టానికి చేరాయి. బ్యారెల్ ధర 35 డాలర్ల దగ్గర ట్రేడవుతోంది. ఆ తగ్గుదల మన దేశానికీ అందుతోంది. అయితే, ఆ లాభం ప్రజలకు చేరముందే, కేంద్రం లాగేసుకుంటోంది. ఖజానాను నింపుకునేందుకు సుంకాలను పెంచింది. దీనివల్ల, పెట్రోల్, డీజిల్ ధరలు మన దేశంలో తగ్గినా, సుంకాల పెంపు కారణంగా రేట్లలో మార్పు ఉండదు. ప్రజలకు లాభం ఉండదు.
ఇక, దేశీయ మార్కెట్‌లో ఇంధనం ధరలు వరుసగా మూడోరోజు స్వల్పంగా తగ్గాయి. రోజువారీ రేట్ల రివ్యూ తర్వాత, పెట్రోల్ ధర 14 పైసలు, డీజిల్ ధర 17 పైసలు చొప్పున తగ్గింది. ఈ తగ్గుదల తర్వాత, హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర 74 రూపాయల 27 పైసలకు, డీజిల్ రేటు 68 రూపాయల 14 పైసలకు తగ్గింది. విజయవాడలో లీటరు పెట్రోల్ ధర 13 పైసలు తగ్గి, 74న్నర రూపాయలకు చేరింది. డీజిల్ ధర 16 పైసలు తగ్గి, 68 రూపాయల 46 పైసలకు చేరింది.
దేశ రాజధాని ఢిల్లీలోనూ ఇంచుమించుగా ధరలు ఇలాగే ఉన్నాయి. పెట్రోల్ ధర 27 పైసలు తగ్గి 69 రూపాయల 87 పైసలకు చేరగా, డీజిల్ ధర 31 పైసలు తగ్గి 62 రూపాయల 58 పైసలకు చేరింది. నిజానికి అంతర్జాతీయ మార్కెట్లలో తగ్గుదలతో పోలిస్తే, మన దగ్గర లీటరుకు తక్కువలో తక్కువగా 6 రూపాయలైనా తగ్గాలి. వాస్తవ పరిస్థితి మాత్రం పైసల్లో ఉంది. ఈ వ్యత్యాసమంతా కేంద్రం బొక్కసంలోకి వెళ్తోంది.